జ్యోతిష్యం & వాస్తు

ఏ రాశి వారు ఏ రంగంలో అయితే రాణిస్తారో తెలుసా..?

మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. రాశులను బట్టి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అయితే కెరీర్ విషయంలో చాలామంది ఎన్నో ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు. రాశులను బట్టి ఏ రాశి వాళ్ళకి ఏ రంగం కలిసి వస్తుందనేది తెలుసుకుందాం. మేష రాశి వాళ్ళకి ఫ్యాక్టరీ, పోలీసు, మిలటరీ, రైల్వే స్టేషన్ శాఖలో బాగుంటుంది. వైద్య రంగంలోకి కూడా వెళ్లొచ్చు. ఇనుము, మందుల షాపు, కొరియర్, కలప, వ్యాపారాలు చేసుకోవచ్చు. మేష రాశి వాళ్లలో భరణి నక్షత్రం అయితే సంగీతం, బట్టల‌ మిల్లులు, భవన నిర్మాణం, వాహనాన్ని నడపడం వంటివి బాగుంటాయి. రత్నాల వ్యాపారం, సినిమా థియేటర్, హోటల్, పశువైద్యం, గృహపయోగ సామాగ్రి, పాలు వంటివి కూడా కలిసి వస్తాయి.

కృతిక నక్షత్రం అయితే రక్షణ శాఖ, రసాయన కర్మాగారాలు, అగ్ని సంబంధ కర్మాగారాలు మొదలైనవి కలిసొస్తాయి. ఎలక్ట్రికల్ షాపులు, భవన నిర్మాణానికి కావలసిన సామాగ్రి, ఆయుధాల‌ తయారీ వంటివి కూడా కల‌సి వస్తాయి. ఇక వృషభ రాశి వారి విషయానికి వస్తే.. కృత్తిక భావ నక్షత్రం అయితే నగల వ్యాపారం, ఫోటోగ్రఫీ, రెడీమేడ్ బట్టల వ్యాపారం వంటివి కలిసి వస్తాయి. అలాగే రోహిణి నక్షత్రం అయితే హోటల్, బేకరీ, లాడ్జి, బట్టలు, ఫ్యాక్టరీ వంటివి కలిసి వస్తాయి.

మృగశిర నక్షత్రం వాళ్లకి రియ‌ల్ ఎస్టేట్స్, పురుగుల‌ మందులు, ఇంజనీరింగ్, బ్రాందీ షాపులు, పళ్ళ దుకాణాలు కల‌సి వస్తాయి. మిధున రాశి వాళ్ల విషయానికి వస్తే.. మృగశిర నక్షత్రం అయితే స్పేర్ పార్టులు, ఎలక్ట్రిక్ వస్తువులు, మందులు తయారు చేయడం, బేకరీ మొదలైనవి కల‌సి వస్తాయి. ఆరుద్ర నక్షత్రం అయితే పుస్తకాల షాపు, అడ్వర్టైజ్మెంట్ల బిజినెస్, రేడియో, పురుగుల మందులు, న్యూస్ పేపర్ ఏజెన్సీ వంటివి కలిసి వస్తాయి. భావ నక్షత్రం పునర్వసు అయితే ఇంజనీరింగ్ కమిషన్ రంగం, విద్యాబోధన, ఇన్సూరెన్స్, పోస్టల్ శాఖ, రాజకీయం మొదలైనవి కలిసి వ‌స్తాయి.

కర్కాటక రాశి వారి విషయానికి వస్తే.. భావ నక్షత్రం పునర్వసు అయితే ఫైనాన్స్, దేవాలయం, వైద్యం, బ్యాంకులు మొదలైనవి కలిసొస్తాయి. పుష్యమి అయితే.. ఇంజనీర్, పెట్రోల్, బ్లడ్ బ్యాంక్ మొదలైనవి కలిసొస్తాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్లకి సినిమా థియేటర్లు, రంగులు వేయడం, బట్టల మిల్లులు మొదలైనవి కలిసొస్తాయి. సింహరాశి వాళ్లకు అయితే.. మ‌ఖ వాళ్లకి న్యాయవాది, వైద్యుడు, సెక్యూరిటీ ఆఫీస్ మొదలైనవి కలిసొస్తాయి. పూర్వ ఫాల్గుణ అయితే.. సేల్స్ మెన్, ఆటోమొబైల్, సినిమా హాల్స్ మొదలైనవి కలిసి వస్తాయి.

ఉత్తర ఫాల్గుణ అయితే కలెక్టర్, ఐజి, ప్రభుత్వ శాఖల ఉద్యోగాలు వంటివి కలిసి వస్తాయి. కన్య రాశి వాళ్ల విషయానికి వస్తే.. ఉత్తర ఫాల్గుణ నక్షత్రం వాళ్లకి లెక్చరర్, స్పీకర్లు తయారు చేయడం వంటివి కలిసి వస్తాయి. బట్టల షాపు, పొగాకు సంస్థలు, ఇంపోర్ట్ షిప్పింగ్, చెరువులు మొదలైనవి కలిసొస్తాయి. చిత్త అయితే సేల్స్ టాక్స్, డిపార్ట్మెంట్, గుమస్తా శాఖలు, నగల షాపులు వంటివి కలిసి వస్తాయి. తుల రాశి వారి విషయానికి వస్తే.. చిత్త నక్షత్రం వారికి ఎలక్ట్రికల్ వస్తువులు, నగల వర్తకం వంటివి కలిసి వస్తాయి.

స్వాతి నక్షత్రం వాళ్లకి స్త్రీల వస్తువులు, ఎగ్జిబిషన్స్ నడపడం, రాజకీయ రంగం కలిసి వస్తాయి. విశాఖ నక్షత్రం వాళ్లకి, బ్యాంకులు, ఫైనాన్స్, బట్టలు వంటివి కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళ విషయానికి వస్తే.. విశాఖ నక్షత్రం వారికి షేర్ మార్కెట్, భూస్వామి, లాయర్, జడ్జ్, ఇన్సూరెన్స్ వంటివి కలిసి వస్తాయి. జేష్ఠా వాళ్ళకి వైద్యం, కంప్యూటర్ వంటివి కలిసి వస్తాయి. ధనస్సు రాశి వాళ్ళ గురించి చూస్తే.. మూల నక్షత్రం వారికి విద్యా బోధన, ప్రభుత్వ రాయబారాలు మొదలైనవి కలిసొస్తాయి.

పూర్వాషాఢ నక్షత్రం వారికి బ్యాంకులు, ఆడిట్ సంస్థలు, శిశు సంక్షేమ శాఖలు మొదలైనవి కలిసి వస్తాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఆయుర్వేద వైద్యం, బ్యాంకులు, న్యాయవాది మొదలైనవి కలిసొస్తాయి. మకర వాళ్లకి.. భావనక్షత్రం ఉత్తరాషాఢ అయితే స్టీలు మెటీరియల్ సప్లై చేయడం, మునిసిపల్ కార్పొరేషన్లు, పబ్లిక్ శానిటేషన్ మొదలైనవి కలిసొస్తాయి. శ్రావణ నక్షత్రం వారికి గ్రానైట్, రాళ్లు, నూనె మిల్లులు వంటివి కలిసి వస్తాయి.
జూనియర్ ఇంజనీర్ వంటివి కలిసి వస్తాయి.

కుంభ రాశి గురించి చూస్తే.. ధనిష్ట నక్షత్రం వారికి ఫిజిక్స్, వ్యాయామ శాఖ, రాజకీయం, ఫోటోగ్రఫీ వంటివి కలిసి వస్తాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి సెన్సార్ బోర్డు, జ్యోతిష్యం వంటివి కలిసి వస్తాయి. పూర్వభాద్ర నక్షత్రం అయితే.. బ్యాంకులు, లీడర్లు వంటివి కలిసి వస్తాయి. మీన రాశి వాళ్ల విషయానికి వస్తే.. పూర్వభాద్ర నక్షత్రం వాళ్లకి రాజకీయాలు వంటివి కలిసి వస్తాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సిఐడి, రక్షణ శాఖలు, రాయబారాలు వంటివి కలిసి వస్తాయి. రేవతి నక్షత్రం వాళ్లకి షేర్ మార్కెట్, చిట్ ఫండ్, కొరియర్ ప్రింటింగ్ ఇటువంటివి కలిసొస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…

Saturday, 24 January 2026, 5:25 PM

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM

కేవలం రూ.9,699కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్లౌపంక్ట్ నుంచి అదిరిపోయే లాంచ్!

బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…

Thursday, 22 January 2026, 1:51 PM