నవగ్రహాలు అనుకూలించాలంటే, ఇలా చేయాల్సిందే. ఇలా చేయడం వలన నవగ్రహాలు అనుకూలంగా మారుతాయి. తల్లిదండ్రులని గౌరవిస్తే రవి చంద్రులు అనుకూలిస్తారు. తల్లిదండ్రులకి సేవ చేసుకోండి. గురు బలం కావాలంటే అతిథుల్ని గౌరవించండి. పసుపుని పాలతో పాటు కలిపి నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. ఆడవాళ్ళు అయితే ముఖానికి పసుపు రాసుకోవాలి. కుజుడి అనుగ్రహం కోసం సోదర వర్గాన్ని ఆదరించాలి.
శుక్ర గ్రహం అనుకూలించాలంటే ఆడపిల్లల్ని గౌరవించాలి. అప్పుడు శుక్ర గ్రహం అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో ఆడపిల్లలు లేకపోతే మేనత్తని గౌరవించండి. అత్త కూడా లేకపోతే కన్నతల్లిని గౌరవించండి. శని గ్రహం అనుకూలించాలంటే ఇంట్లో పని మనుషులని చికాకు పడకుండా చూసుకోవాలి. తగినంత జీతాన్ని పని వారికి ఇవ్వాలి. పనివాళ్ళు లేకపోతే పేదలకి, వికలాంగులకు సాయం చేయాలి. బుధుడి అనుగ్రహం కోసం మేనమామని ఆదరించాలి.
లగ్నకుండలి ఆధారంగా కొందరి జాతకంలో చూసినట్లయితే అన్నదానం చేయకూడదు. వాళ్ళు అన్నదానం చేస్తే అన్నం తిన్న వాళ్ళు తిరిగి యజమానికి ద్రోహం చేస్తారట. అలాగే బంధువులు వీళ్ళ ఇంటికి వచ్చి కొంతకాలం ఉండిపోయి వీళ్ళని మోసం చేస్తుంటారు. రవి అనుగ్రహం కోసం ఎవరి దగ్గర ఏ వస్తువుని ఫ్రీగా తీసుకోకూడదు. కుజుడి స్థితిని బట్టి కొంతమందికి చక్కెర వ్యాపారం చేయకూడదు.
బుధుడి స్థితిని బట్టి కొంతమంది మాంసాహారం, గుడ్లు, చేపలు తినకూడదు. గురువు యొక్క స్థితిని ఆధారంగా సాధువులకి, సన్యాసులకి సహాయం చేయకూడదు. వస్త్రాలను దానంగా ఇవ్వకూడదు. రాహువు స్థితి ఆధారంగా కొంతమంది నీలం రంగు, నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. కుక్కలని పెంచుకోకూడదు. కేతువు స్థితి ఆధారంగా కొంతమంది తప్పుడు వాగ్దానాలు చేయరాదు. అలానే సంతానం లేని వాళ్ళ నుండి భూమిని కొనుగోలు చేయకూడదు. ఈసారి చూసారు కదా.. నవగ్రహాలు అనుకూలించాలంటే, ఏం చేయాలని. మరి ఇక ఈ విధంగా ఆచరించండి. అప్పుడు నవగ్రహాలు అనుకూలంగా ఉంటాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…