Black Ants : ఇంట్లో న‌ల్ల చీమ‌లు క‌నిపిస్తే ఏం జ‌రుగుతుంది..? ఇది కీడు చేస్తుందా.. మంచి చేస్తుందా..?

December 16, 2023 11:14 AM

Black Ants : చాలామంది, ఇంట్లో ఎక్కువగా చీమలు కనబడుతుంటాయి. ముఖ్యంగా నల్ల చీమలు ఇంట్లో ఉంటూ ఉంటాయి. ఇంట్లో నల్ల చీమలు ఉండడం మంచిదా..? కాదా..? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ విషయాన్ని, ఈరోజు తెలుసుకుందాం. మన ఇంట్లో ఉండే రంగులు, వస్తువులు, అలానే జీవులు ఇవన్నీ కూడా మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంట్లోకి వచ్చిన ప్రతి దాని వెనుక అనుకూల శక్తి, ప్రతికూల శక్తి రెండూ ఉంటాయి. కొన్ని రకాల జీవులు ఇంట్లోకి వస్తే, శుభప్రదంగా పరిగణించబడుతుంది.

కొన్ని రకాల జీవులు ఇంట్లోకి వస్తే, అది అశుభంగా పరిగణించబడుతుంది. ఎండాకాలంలో ఇంట్లో ఎక్కువ చీమలు ఉంటుంటాయి. ఎర్ర చీమలు కనపడడాన్ని శుభంగా భావిస్తారు. ఇంట్లో సంపద బాగా పెరుగుతుంది. ఇంట్లో ఎర్ర చీమలకి చక్కెర, బెల్లం పెడితే కూడా మంచిది. నల్ల చీమలు కనపడితే ఏమవుతుంది అనే విషయానికి వచ్చేస్తే.. వాస్తు ప్రకారం నల్ల చీమలు కనిపించడానికి కూడా శుభప్రదంగానే భావిస్తారు. నల్ల చీమలు కనపడితే ఆనందం, శ్రేయస్సు కలగబోతున్నట్లు అర్థం.

what happens if you have Black Ants in home according to vastu
Black Ants

అలానే, ఇంటికి వచ్చిన నల్ల చీమలకు ఆహారాన్ని పెడితే కూడా మంచిది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వరుస కట్టి ఇంట్లోకి వచ్చే నల్ల చీమల వలన, ఇంట్లో పేదరికం తొలగిపోతుంది. సంపద పెరుగుతుంది. బాధలు తొలగిపోతాయి. నల్ల చీమలు ఇంట్లో ఉంటే, కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. దంపతుల మధ్య సంతోషం కలుగుతుంది. ఆనందం కూడా ఉంటుంది.

ఇంట్లోకి పిచ్చుకలు వస్తే కూడా మంచిది. ఇంట్లోకి పిచ్చుకలు వస్తే సుఖ సంతోషాలు వస్తాయి. ఇంట్లోకి పిచ్చుకలు రావడాన్ని శుభసూచకంగానే భావిస్తారు. పిచ్చుకలు ఇంట్లోకి వచ్చినట్లయితే, ఆ ఇంటికి త్వరలో మంచి జరగబోతోంది. పెళ్లి కూడా జరగబోతుంది అని అర్థం. ఇంట్లోని కుటుంబ సభ్యులకు సంతానం కూడా కలుగుతుందట. అలానే, చాలామంది కాకి ని అశుభంగా భావిస్తారు. కాకి పితృదేవతలకి ప్రతీక. కాకులు ఇంట్లోకి వస్తే పితృదేవతలు ఆశీర్వదించడము.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now