Vastu Tips : ఇంట్లో ఈ ప్ర‌దేశంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ బ‌రువులు పెట్ట‌కూడ‌దు.. జాగ్ర‌త్త‌..!

October 29, 2023 9:32 PM

Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇల్లు, గుడి, కార్యాలయం ఏదైనా నిర్మాణం చేస్తే తప్పక వాస్తు నియమాలను పాటిస్తారు. గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి వాస్తు నియమాలను మన పూర్వీకులు ఏర్పాటుచేశారు. దీనిలో ప్రధానంగా ఈశాన్యం గురించి తెలుసుకుందాం. ఈశాన్యంలో బరువులు పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది. ఈశాన్యంలో బరువులు పెడితే ధననష్టం కలుగుతుంది.

ఈశాన్యంలో సాక్షాత్తు ఈశ్వరుడు కొలువై ఉంటాడు. ఈశాన్యంలో బరువులు లేదా వస్తువులు పెట్టడం ద్వారా ఈశాన్య దిక్కు మూసుకుపోతుంది. అక్కడ నుంచి వచ్చే గాలి, వెలుతురు సరిగా రాదు. వేకువ జామున‌ సూర్యోదయం సమయంలో ఈశాన్యం, తూర్పు నుంచి వచ్చే సూర్మరశ్మి ఇంట్లోకి రావడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. అందుకోసమే ఈశాన్య దిక్కులో ఎటువంటి వస్తువులు పెట్టుకోకుండా ఖాళీగా ఉంచాలి.

Vastu Tips do not put weights in this place
Vastu Tips

ఈశాన్య భాగ దిక్పాలకుడు ఎంతో సున్నితత్వం కలవాడు కాబట్టి ఈశాన్యం వైపు గరికపోచ బరువు కూడా ఉండకూడదు అని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఈశాన్యంలో ద్వారం అది వీలుకాకుంటే కనీసం పెద్ద కిటికీలు పెట్టుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఈశాన్య నుంచి వచ్చే వాయువుల వల్ల మనసు తేలికవుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకే ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదు. కావాలంటే మీరు ప్రాక్టికల్‌గా అక్కడ నుంచి వచ్చే గాలి, వెలుతురును పరిశీలించండి. తర్వాతనే వాస్తుకు విలువ ఇవ్వండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now