Vastu Tips : ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ చేతి నుంచి జారిపోకుండా చూసుకోండి..!

December 13, 2023 12:08 PM

Vastu Tips : మన పెద్దవాళ్లు ఇలా జరగకూడదు, ఇలా జరిగితే మంచిది కాదు. ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు. కొంతమంది వీటిని పాటిస్తే, కొంత మంది మాత్రం వీటిని కొట్టి పారేస్తూ ఉంటారు. మన చేతిలో నుండి, కొన్ని కొన్ని వస్తువులు జారీ పడిపోకూడదు. ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా, ఒక్కొక్కసారి ఏదో ఒకటి మన చేతి నుండి జారిపోతూ ఉంటాయి. అయితే, వీటిని పట్టుకునేటప్పుడు మాత్రం, జాగ్రత్తగా పట్టుకోవాలి. కింద పడిపోకుండా చూసుకోవాలి. ఎప్పుడూ కూడా, ఇవి చేయి జారిపోకుండా చూసుకోండి. లేదంటే దురదృష్టం కలుగుతుంది. ఇబ్బందులు వస్తాయి. ఇవి కనుక, చేతి నుండి కింద పోయాయంటే, జీవితం పై ప్రతికూల ప్రభావం కనబడుతుంది.

ఇక ఎటువంటి వస్తువులు చేతి నుండి జారి పడకూడదు అనే విషయాన్ని చూసేద్దాం. చేతి నుండి ఎప్పుడూ కూడా ఉప్పు జారిపోవడం మంచిది కాదు. జాగ్రత్తగా ఉప్పుని పట్టుకోవాలి. లక్ష్మీదేవి ప్రతిరూపం ఉప్పు. శనిప్రభావముని తొలగించేందుకు, చాలామంది ఉప్పును దానం చేస్తారు. ఉప్పు కనుక జారి కింద పడింది అంటే డబ్బు కొరత వస్తుంది. కాబట్టి, ఉప్పుని పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Vastu Tips do not drop these items from hand
Vastu Tips

పాలు ఎప్పుడు కూడా కింద పడిపోకూడదు. పాలు కనుక కింద చేజారి పడిపోయాయి అంటే ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు కలుగుతాయి. గృహప్రవేశం అప్పుడు మాత్రమే పాలని పొంగిస్తారు. కానీ, పాలు ఎప్పుడు పడితే అప్పుడు కింద పడిపోకూడదు. నల్ల మిరియాలు చేజారి పోతే కూడా అసలు మంచిది కాదు. ఇలా చేజారిపోతే, అనారోగ్య సమస్యలు వస్తాయి.

పూజ ఫలకం కింద పడిందంటే, అసలు మంచిది కాదు. ఇలా జరిగితే, కుటుంబంలో పెద్ద సంక్షోభం ఏర్పడబోతోందని దానికి కారణం. కాబట్టి, ఈ తప్పు కూడా జరగకుండా చూసుకోవాలి. మనం తినే ఆహారాన్ని ఎప్పుడు కింద పడేయకూడదు. ఎప్పుడూ కూడా అన్నం ని జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నం కింద పడిందంటే, తీసుకుని కళ్ళకు అద్దుకోవాలి చాలామంది తరచూ అన్నాన్ని పడేస్తూ ఉంటారు. అలా జరిగితే ఆర్థిక బాధలు వస్తాయి లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now