Tongue Spots : కొంత మంది నాలుక మీద మచ్చలు ఉంటాయి. నాలుక మీద మచ్చలు ఉండేవారు ఏది అంటే అది జరిగిపోతుందా..? సినిమాల్లో కానీ పెద్దలు చెప్పడం కానీ మీరు వినే ఉంటారు. నాలుక మీద మచ్చలు ఉంటే, వారు చెప్పేదంతా నిజమైపోతుందని అంటూ ఉంటారు. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం నాలుక మీద మచ్చలు ఉంటే ఏమవుతుంది..? ఆ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం.
పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం నాలుక మీద మచ్చలు ఉన్న వాళ్ళకి, వాక్ పటిమ, వాక్ సిద్ధి ఉంటుందని.. వారు అన్నవి కానీ, వారు చెప్పినవి కానీ జరుగుతాయని అంటారు. నాలుక మీద ఉండే పుట్టు మచ్చలకు ప్రాముఖ్యత ఏంటనేది చూస్తే.. సరస్వతీ దేవి ఉపాసన తరతరాల్లో బాగా చేసి వున్నా, సరస్వతి దేవి కటాక్షం వున్నా.. వారి నాలుక మీద అమ్మవారు ఐం అనే బీజాక్షరం రాసి ఉంటుందట. అదే పుట్టు మచ్చగా కనబడుతుంది అని పెద్దలు అంటారు. అయితే ఇందులో రెండు రకాలు. ఒకటి చెడు ఎక్కువగా మాట్లాడే వారు. చెడుకు సంబంధించినవి వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు. అవి జరుగుతుంటాయి. వీరికి ఎక్కువ గౌరవం లభించదు.
దైవానుగ్రహం కనుక ఇంకా పెరగాలంటే మంచే మాట్లాడాలి. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం వాక్ సిద్ధి నాలుకపై ఐం రాయడం వలన వస్తుంది. అయితే అలా వున్న వాళ్ళు అనవసరంగా మాట్లాడకుండా, అబద్ధాలు పలకకుండా కేవలం ఎవరు అయితే సత్యాన్ని మాట్లాడతారో వారికే మంచి జరుగుతుంది. ఎక్కువ, తక్కువ కాకుండా సరిగ్గా మాట్లాడితే వారికి అమ్మవారి కటాక్షం లభిస్తుంది. దైవనుగ్రహం కూడా బాగా పెరుగుతుంది. కానీ అదే పనిగా అబద్దాలు చెబుతూ వుండే వాళ్లకి మాత్రం ఆ శక్తి ఉండదు. వీరికి ఎక్కువ గౌరవం ఉండదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…