జ్యోతిష్యం & వాస్తు

Peacock Feathers : ఇంట్లో నెమ‌లి ఈక‌ల‌ను ఈ దిక్కున పెట్టండి.. ద‌రిద్రం పోయి సంప‌ద వ‌చ్చి ప‌డుతూనే ఉంటుంది..!

Peacock Feathers : జోతిష్య శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో నెమ‌లి ఈక‌లకు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. శ్రీకృష్ణుడు నెమ‌లి ఈక‌ల‌ను చాలా ఇష్ట‌ప‌డ‌తాడు. కృష్ణుడు ఎప్పుడూ కూడా నెమ‌లి ఈక‌ల‌ను ధ‌రిస్తాడు. ఇవి ఎంతో అందంగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్ట‌ప‌డ‌తారు. ఇంట్లో కూడా వీటిని అలంక‌ర‌ణ వ‌స్తువుగా ఉంచుతారు. అయితే నెమ‌లి ఈక‌ల‌ను అంద‌రూ ఇష్ట‌ప‌డిన‌ప్ప‌టికి వీటిని ఇంట్లో ఉంచ‌డంపై మ‌న‌లో చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయి. అస‌లు నెమ‌లి ఈక‌ల‌ను ఇంట్లో ఉంచుకోవ‌చ్చా..? లేదా..? ఇంట్లో నెమ‌లి ఈక‌ల‌ను ఉంచుకోవ‌డం వ‌ల్ల ఎటువంటి ఫ‌లితాలు క‌లుగుతాయి..అస‌లు వీటిని ఏ దిశ‌లో ఉంచాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్ట‌మైన ఈ నెమ‌లిఈక‌లను ఇంట్లో ఉంచుకోవ‌చ్చు.

వీటిని ఇంట్లో ఉంచుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు. నెమ‌లి ఈక‌ల‌ను ఇంట్లో ఉంచ‌డం వ‌ల్ల సంతోషం మ‌రియు శ్రేయ‌స్సు క‌లుగుతుంది. వాస్తు శాస్త్రంలో నెమ‌లి ఈక‌ల‌కు ఎంతో ప్రాధాణ్య‌త ఉంది. వీటిని ఇంట్లో ఉంచ‌డం వ‌ల్ల అనేక వాస్తు దోషాలు తొల‌గిపోతాయి. అలాగే వీటిని ఇంట్లో స‌రైన దిశ‌లో ఉంచ‌డం వ‌ల్ల ఇంట్లో సంప‌ద‌కు లోటు ఉండదు. ఆర్థిక స్థితి మెరుగుప‌డుతుంది. ఆర్థికంగా చాలా బ‌లంగా త‌యార‌వుతారు. నెమ‌లి ఈక‌లను ఇంట్లో ద‌క్షిణ దిశ‌లో ఉంచ‌డం వ‌ల్ల డ‌బ్బుకు లోటు ఉండ‌దు. ద‌క్షిణ దిశ‌తో పాటు వీటిని నైరుతి దిశ‌లో, తూర్పు దిశ‌లో కూడా ఉంచుకోవ‌చ్చు. ఇంట్లోని వారి జాత‌కంలో రాహుదోషం ఉంటే నెమ‌లి ఈక‌ల‌ను తూర్పు లేదా వాయువ్య దిశ‌లో ఉంచ‌డం మంచిది. రాహుదోషం వ‌ల్ల విజయాలు సాధించ‌లేక‌పోవ‌డం, ఆటంకాలు ఎదుర‌వ‌డం వంటివి జ‌రుగుతాయి.

Peacock Feathers

ఇంట్లో నెమ‌లి ఈకల‌ను ఉంచ‌డం వ‌ల్ల రాహుదోషం వ‌ల్ల క‌లిగే స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే పిల్ల‌ల గ‌దిలో స్ట‌డీ టేబుల్ ద‌గ్గ‌ర ఒక‌టి లేదా రెండు నెమ‌లి ఈక‌ల‌ను ఉంచ‌డం వ‌ల్ల మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల పిల్ల‌ల‌ల్లో ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంద‌ని పండితులు తెలియ‌జేస్తున్నారు.అలాగే ఇంట్లో త‌రుచూ గొడ‌వ‌లు జ‌రుగుతూ ఉంటే ఇంట్లో తూర్పు గోడ‌పై 7 నెమ‌లి ఈక‌ల‌ను ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో సంతోషం, శాంతి క‌లుగుతుంది.

అలాగే ఇంట్లో వైవాహిక జీవితానికి సంబంధించి గొడ‌వ‌లు జ‌రుగుతూ ఉంటే ప‌డ‌క గ‌దిలో నైరుతి దిశ‌లో 2 నెమ‌లిఈక‌ల‌ను ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గొడ‌వ‌లు త‌గ్గి బంధం బ‌ల‌ప‌డుతుంది. అలాగే ఇంట్లో వాస్తు దోషం గనుక ఉంటే సోమ‌వారం నాడు 8 నెమ‌లి ఈక‌ల‌ను తీసుకుని వాటిని ద‌గ్గ‌రగా క‌ట్టాలి. త‌రువాత ఓం న‌మః శివాయ అనే మంత్రాన్ని జ‌పిస్తూ ఉత్త‌రం లేదా తూర్పు దిశ‌లో ఉంచాలి. ఇలా చేయ‌డం వల్ల వాస్తు దోషాలు తొల‌గిపోతాయి. ఈవిధంగా నెమ‌లి ఈక‌ల‌ను స‌రైన దిశలో ఇంట్లో ఉంచుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో మేలు క‌లుగుతుంద‌ని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM