జ్యోతిష్యం & వాస్తు

Cow In Dream : క‌ల‌లో మీకు ఆవు క‌నిపించిందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cow In Dream : మ‌నం నిద్రించిన‌ప్పుడు క‌ల‌లు రావ‌డం చాలా స‌హ‌జం. మ‌న రోజు వారి జీవితంలో జ‌రుగుతున్న సంఘ‌టన‌ల ఆధారంగా కొన్ని క‌ల‌లు వ‌స్తే మ‌న‌కే తెలియ‌ని ఊహ‌జ‌నితా లోకంలో విహ‌రిస్తున్న‌ట్టు ఉండే క‌ల‌లు కూడా వ‌స్తూ ఉంటాయి. కొన్ని క‌ల‌లు మ‌న‌కు భ‌యాన్నిక‌లిగించేవిగా, మ‌న నిద్ర‌ను పాడు చేసేవిగా ఉంటే కొన్ని మాత్రం మ‌న‌కు ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి. డ్రీమ్ సైన్స్ ప్ర‌కారం ప్ర‌తి క‌లకి ఒక అర్థం ఉంటుంది. క‌ల‌లో క‌నిపించే ప్ర‌తి ఒక్క‌టి కూడా మ‌న‌కు కొన్ని సూచ‌న‌ల‌ను ఇస్తుంది. క‌ల‌లో గ‌నుక ఆవు క‌నిపించిన‌ట్ల‌యితే మ‌న జీవితంలో మార్పు వ‌స్తుంది. హిందువులు ఆవును ఎంతో ప‌విత్రంగా భావిస్తారు. ఆవుకు పూజ‌లు చేసి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. ఎంతో ప‌విత్రంగా భావించే ఆవు క‌ల‌లో క‌నిపిస్తే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

క‌ల‌లో ఆవు క‌నిపిస్తే చాలా శుభ‌దాయ‌కం. క‌ల‌లో ఆవు క‌నిపించిన‌ట్ల‌యితే ఇంట్లో సుఖ‌శాంతులు నెల‌కొంటాయి. శుభ‌వార్త‌ల‌ను వింటారు. వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. అలాగే క‌ల‌లో ఆవుకు రొట్టె తినిపిస్తున్న‌ట్టు కూడా క‌నిపిస్తుంది. ఆవుకు రొట్టె తినిపించ‌న‌ట్టు క‌ల‌లో వ‌స్తే అది కూడా శుభ‌దాయ‌కం. డ్రీమ్ సైన్స్ ప్ర‌కారం ఇలాంటి క‌ల రావ‌డం వ‌ల్ల త్వ‌ర‌లో మీరు ఏదో ఒక దీర్ఘ‌కాలిక వ్యాధి నుండి బ‌య‌ట‌ప‌డ‌తార‌ని అర్థం. ఆవుకు రొట్టె తినిపించిన‌ట్టు క‌ల వ‌స్తే వ్యాధి త‌గ్గి ఆరోగ్యంగా త‌యార‌వుతారు. అలాగే క‌ల‌లో ఆవుగుంపును, ఆవుల మంద‌ను చూడ‌డం కూడా శుభ‌ప్ర‌దం. ఇలాంటి క‌ల వ‌స్తే మీరు ఆర్థికంగా చాలా లాభ‌ప‌డతారు. చేస్తున్న ప‌నుల్లో ఆటంకాలు తొల‌గిపోయి విజ‌యం సాధిస్తారు. అంతేకాకుండా మీకు స‌మాజంలో గౌర‌వం కూడా ల‌భిస్తుంది.

Cow In Dream

వ్యాపారం వృద్ది చెందుతుంది. అదేవిధంగా క‌ల‌లో ఆవు దూడ‌ను క‌నిపించిన‌ట్ట‌యితే మీరు ఆర్థికంగా లాభం పొందుతారు. ఇది కూడా చ‌క్క‌టి శుభ‌సూచ‌కం. ఆవు దూడ క‌నిపించడం వ‌ల్ల ఊహించ‌ని ఆర్థిక లాభం చేకూరుతుంది. మీకు చేరాల్సిన డ‌బ్బు కూడా చేరుతుంది. అలాగేమీరు కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. ఈ ప‌నుల్లో కూడా మంచి ఫ‌లితాల‌ను, చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాల‌ను పొందుతారు. అంతేకాకుండా ఆవు దూడ క‌నిపించ‌డం వ‌ల్ల మీ పిల్ల‌ల నుండి చ‌క్క‌టి శుభ‌వార్త‌ను వింటారు. క‌ల‌లో ఆవు క‌నిపిస్తే మ‌న‌కు ఎంతో మేలు క‌లుగుతుంద‌ని, ఆవు క‌నిపించ‌డం ఎంతో శుభ‌దాయ‌క‌మ‌ని డ్రీమ్ సైన్స్ చెబుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM