Nail Cut Days : పూర్వకాలం నుంచి మన పెద్దలు పాటిస్తూ వస్తున్న అనేక ఆచారాలు, సంప్రదాయాలతోపాటు వారు విశ్వసిస్తున్న నమ్మకాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిల్లో గోర్లను కత్తిరించడం కూడా ఒకటి. చాలా మంది గోర్లను కట్ చేసేందుకు సమయం ఏదీ చూడడం లేదు. కానీ ఈ విషయంలో మాత్రం మన పూర్వీకులు పలు నమ్మకాలను పాటించేవారు. ముఖ్యంగా రాత్రిపూట గోర్లను అసలు కట్ చేయవద్దని చెప్పేవారు. అలాగే వారంలో కొన్ని నిర్దిష్టమైన రోజుల్లో మాత్రమే గోర్లను కట్ చేయాలని, లేదంటే అరిష్టం కలుగుతుందని, అన్నీ సమస్యలే వస్తాయని చెప్పేవారు. ఇక వారంలో గోర్లను కట్ చేసేందుకు ఏయే రోజులు అనువుగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వారంలో సోమవారం రోజున గోర్లను కత్తిరించడం వల్ల మనుషుల శరీరంలో ఉండే రాక్షస గుణం పోతుంది. సాధు మనుషులుగా, మంచి గుణం ఉండేవారిగా మారుతారు. దుష్టబుద్ధి ఉండదు. సత్ప్రవర్తనతో మెలుగుతారు. అలాగే మంగళవారం హనుమాన్‌ను పూజిస్తారు. కనుక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆ రోజు గోర్లను కట్ చేస్తే అప్పుల బాధ నుంచి బయట పడతారు. రుణ విముక్తులు అవుతారు. ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి.
బుధవారం నాడు గోర్లను కత్తిరించడం ఎంతో మంచిదట. ఆ రోజు గోర్లను కట్ చేస్తే అనేక లాభాలు కలుగుతాయట. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో విజయం సాధిస్తారు. మంచి ఎదుగుదల ఉంటుంది. అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక గురువారం నాడు ఎట్టి పరిస్థితిలోనూ గోర్లను కట్ చేయవద్దట. లేదంటే అదృష్టం కూడా దురదృష్టంగా మారుతుందట. ఏం చేసినా కలసి రాదట. ఇక శుక్రవారం నాడు గోర్లను కట్ చేయవచ్చు. దీంతో ఎంతో మంచి జరుగుతుందట. లక్ష్మీదేవి సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు. దీంతో ధనం, ఆయుష్షు, ఆరోగ్యం, వృద్ధి, అందం అన్నీ పెరుగుతాయట.
ఇక శనివారం నాడు కూడా గోర్లను కట్ చేయవద్దు. గోర్లను కట్ చేస్తే శనిదేవుడు ఆగ్రహిస్తాడు. దీంతో దరిద్రం వస్తుంది. ఎంతటి ధనవంతులు అయినా సరే బిచ్చగాళ్లుగా మారుతారు. మానసిక ప్రశాంతత అనేది ఉండదు. శరీర పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదివారం నాడు కూడా గోర్లను కట్ చేయడం మంచిది కాదట. ఆదివారం నాడు గోర్లను కట్ చేస్తే ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. అపయాజల బారిన పడతారు. ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. కనుక గోర్లను కట్ చేసుకునే విషయంలో ఈ సూచనలు పాటించడం తప్పనిసరి అని పండితులు చెబుతున్నారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…