Love Line : మీ చేతిలోని రేఖ‌ల ద్వారా మీ వైవాహిక జీవితం ఎలా ఉంటుందో ఇలా తెలుసుకోవ‌చ్చు..!

April 25, 2024 8:11 AM

Love Line : మ‌న‌లో చాలా మంది వారిది ప్రేమ వివాహామా లేదా పెద్దలు కుదిర్చిన వివాహమా అని ముందుగానే తెలుసుకోవాల‌నే కోరిక‌ను క‌లిగి ఉంటారు. అయితే వాస్త‌వానికి మ‌న చేతి రేఖ‌ల‌ను బ‌ట్టి మ‌న వైవాహిక జీవితం గురించి తెలుసుకోవ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు. హ‌స్తసాముద్రికం ద్వారా మ‌న చేతి రేఖ‌ల‌ను బ‌ట్టి వైవాహిక జీవితం గురించి తెలుసుకోవ‌చ్చు. దీని కోసం మ‌న చేతి రేఖ‌ల‌ను ఎవ‌రికి చూపించాల్సిన అవ‌స‌రం లేదు. మ‌న చేతిలో ఉండే రేఖ‌ల‌ను బ‌ట్టే మ‌నం దీనిని క‌నిపెట్ట‌వ‌చ్చు. చేతి రేఖ‌ల‌ను బ‌ట్టి వైవాహిక జీవితం గురించి ఎలా తెలుసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. హ‌స్త‌సాముద్రికం ప్ర‌కారం వైవాహిక రేఖ‌లు చేతుల యొక్క చిన్న వేలుక్రింద ఉన్న మెర్క్యురీ ప‌ర్వ‌తానికి సంబంధించిన‌వి.

ఈ మౌంట్ మెర్క్యూరీ బ‌య‌ట నుండి లోప‌లికి వ‌చ్చే రేఖ‌ను వివాహ రేఖ అంటారు. ఈ లైన్ ఒక వ్య‌క్తి యొక్క వైవాహిక జీవితం గురించి చాలా చెబుతుంది. మ‌నం ప్రేమ వివాహం చేసుకుంటామా.. పెద్ద‌లు కుదిర్చిన వివాహం చేసుకుంటామా… అని రేఖ‌ను బ‌ట్టి తెలుసుకోవ‌చ్చు. మన అర‌చేతిలో వైవాహిక రేఖ చ‌ద‌ర‌పు ఆకారంలో ఉంటే ప్రేమ వివాహం జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అర్థం చేసుకోవాలి. అలాగే ఈ రేఖ కనుక మ‌ధ్య‌లో క‌ట్ అయిన‌ట్టు ఉంటే వారి వివాహ సంబంధం మ‌ళ్లీ మ‌ళ్లీ విచ్చినమ‌వుతుంద‌ని అర్థం చేసుకోవాలి. అలాగే అర‌చేతిలో చిటికెన వేలు కింద స‌ర‌ళ‌మైన‌, స్ప‌ష్ట‌మైన రేఖ ఉంటే వారిది పెద్ద‌లు కుదిర్చిన వివాహం. అలాగే వీరి వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంద‌ని అర్థం. అదే విధంగా బొట‌న వేలు కింద ఉన్న భాగాన్ని వీన‌స్ ప‌ర్వ‌తం అంటారు.

Love Line in your palm tells about your married life
Love Line

వీన‌స్ ప‌ర్వ‌తం పైకి లేచిన‌ట్టు క‌నిపిస్తే వారిది ప్రేమ వివాహం అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అదే విధంగా హ‌స్త‌సాముద్రికం ప్ర‌కారం చేతిలో వివాహ రేఖ స్ప‌ష్టంగా మ‌రియు లోతుగా ఉంటే వీరి వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అలాంటి వారి జీవిత భాగ‌స్వాములు వారి భావోద్వేగాల‌ను చాలా బాగా అర్థం చేసుకుంటారు. వారు త‌మ జీవిత భాగ‌స్వామి నుండి చ‌క్క‌టి మ‌ద్ద‌తును పొందుతారు. అల‌గే వీన‌స్ ప‌ర్వ‌తం క‌నుక స్ప‌ష్టంగా క‌నిపిస్తే వారి జీవితంలో జీవిత భాగ‌స్వామితో శృంగారం చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ విధంగా మ‌న చేతిలో రేఖ‌ల‌ను బ‌ట్టి మ‌న వైవాహిక జీవితం గురించి చాలా సుల‌భంగా తెలుసుకోవ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now