Lord Shani : శ‌నివారం నాడు ఈ ఆహారాల‌ను తీసుకున్నారో.. అంతే సంగ‌తులు..!

August 23, 2023 5:17 PM

Lord Shani : శనివారం నాడు కొన్ని ఆహార పదార్థాలని అసలు తీసుకోకూడదు. శనివారం నాడు చేసే కొన్ని తప్పుల వలన నష్టాలు ఉంటాయి. శని ఎప్పటికీ కూడా ఇలాంటి తప్పులు చేస్తే క్షమించడు. ఒకరు ముందు జీవితంలో చేసిన మంచి పనులు, చెడు పనులను శని లెక్కపెడతాడు. శని మంచి పనులకి ఆనందిస్తే ఆశీర్వాదాలని పంపిస్తాడు. జీవితాన్ని ఆనందంగా మారుస్తాడు. అదే ఒకవేళ చెడ్డ పనులు చేస్తే శని ఆగ్రహానికి గురై జీవితాంతం ఇబ్బందుల్ని ఎదుర్కోవాలట. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.

శని కోపాన్ని మీరు చూడకూడదు అంటే కచ్చితంగా ఈ పనులను చేయకండి. శనివారం కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదు. లేదంటే శని అగ్రహానికి గురవుతారు. మామిడికాయ అంటే అందరూ ఇష్టపడతారు. మామిడితో ఊరగాయలు, పచ్చడి ఇలా అనేక రకాల వాటిని మనం చేసుకోవచ్చు. అయితే మామిడి ఊరగాయని శనివారం నాడు తీసుకోకూడదు. శనిని కించపరిచేలా ఇది చేస్తుందని, సంపదని కూడా కోల్పోతారని పండితులు చెప్తున్నారు.

Lord Shani will get angry if you take these foods on saturday
Lord Shani

ఆరోగ్యానికి పాలు, పెరుగు మంచివి. అయితే శనివారం నాడు పాలు, పెరుగు తీసుకోకూడదట. ఎర్ర కందిపప్పుని కూడా శనివారం నాడు అసలు తినకూడదని పండితులు అంటున్నారు. ఎర్రని మిరపకాయలను కూడా శనివారం నాడు ఉపయోగించకూడదని, వీటిని తీసుకోవడం వలన శనికి కోపం వస్తుందని పండితులు అంటున్నారు.

మద్యాన్ని కూడా శనివారం నాడు అసలు తీసుకోకూడదట. ఆవనూనెను కూడా శనివారం తీసుకోకూడదు. అలాగే నువ్వులు గింజల్ని కూడా శనివారం నాడు తీసుకోకూడదు. కనుక వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా శనివారం నాడు తీసుకోకండి. శనికి కోపం వస్తుంది. చెడు ఫలితాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి పొరపాటున కూడా ఈ తప్పులను చేయకండి. ఈ తప్పులను చేశారంటే అనవసరంగా నష్టాలు తప్పవు.. అని గుర్తు పెట్టుకోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now