జ్యోతిష్యం & వాస్తు

Lord Shani : తిరోగ‌మ‌న దిశ‌లో ఉన్న శ‌ని.. ఈ రాశుల వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

Lord Shani : న‌వ‌గ్ర‌హాల్లో శ‌ని కూడా ఒక‌రు. ఈయ‌న‌ను క‌ర్మ ప్ర‌దాత అని, న్యాయ దేవుడు అని కూడా పిలుస్తారు. మ‌నం చేసే మంచి, చెడు క‌ర్మ‌ల‌కు అనుగుణంగా శ‌ని మ‌న‌ల్ని శిక్షిస్తాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. మొత్తం 9 గ్ర‌హాల్లో శ‌నీశ్వ‌రుడికే అత్యంత ఎక్కువ ఆగ్ర‌హం ఉంటుంద‌ట‌. అలాగే ఈయ‌న చాలా శ‌క్తివంత‌మైన గ్ర‌హం అని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం.. శ‌నీశ్వ‌రుడు త‌న సొంత రాశిలోనే తిరోగ‌మ‌నంలో ఉన్నాడ‌ట‌. దీంతో ఆయన వ్య‌తిరేక దిశ‌లో సంచ‌రించిన‌ప్పుడు ఆయ‌న ప్ర‌భావం కొంద‌రిపై గ‌ణ‌నీయంగా ప‌డుతుందని పండితులు చెబుతున్నారు. దీన్ని శ‌ని తిరోగ‌మ‌నం అని కూడా అంటార‌ట‌.

ఇలా శ‌నీశ్వ‌రుడు 92 రోజుల పాటు తిరోగ‌మంలో ఉంటాడ‌ట‌. త‌రువాత న‌వంబ‌ర్ 15 నుంచి కుంభ‌రాశి వైపు క‌దులుతాడ‌ట‌. శ‌నీశ్వ‌రుడి తిరోగ‌మ‌న స‌మ‌యంలో ఆయ‌న‌కు న‌చ్చ‌ని పనుల‌ను చేయ‌కూడ‌ద‌ని పండితులు చెబుతున్నారు. శనీశ్వ‌రుడు వ్య‌తిరేక దిశ‌లో ప్ర‌యాణించే స‌మ‌యంలో ఆయ‌న ప్ర‌భావం కొన్ని రాశుల వారిపై ఎక్కువ‌గా ఉంటుంది. మీన, కుంభ‌, మ‌క‌ర రాశుల‌కు చెందిన వారికి ఈ స‌మ‌యంలో ఏలినాటి శ‌ని ప్ర‌భావం ఉంటుంది. అలాగే వృశ్చికం, క‌ర్కాట‌క రాశుల వారిపై కూడా శ‌నిదోష ప్ర‌భావం ప‌డుతుంది. అలాంటి స్థితిలో ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ట‌. అలాగే కుటుంబ స‌భ్యుల మ‌ధ్య క‌ల‌హాలు వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఉంటాయ‌ని పండితులు చెబుతున్నారు.

Lord Shani

శుభ‌కార్యాలు వ‌ద్దు..

ఇక శ‌ని తిరోగ‌మ‌న దిశ‌లో ఉన్న‌ప్పుడు ఆయా రాశుల వారు ఎలాంటి ప‌నుల‌ను ప్రారంభించ‌కూడ‌దు. ముఖ్యంగా కొత్త ప‌నులు చేయ‌కూడ‌దు. అలాగే శుభ కార్యాలను కూడా నిర్వ‌హించ‌కూడ‌దు. శ‌నీశ్వ‌రున్ని న్యాయం చేసే దేవుడిగా విశ్వ‌సిస్తారు. అందువ‌ల్ల ఆయ‌న తిరోగ‌మ‌న దిశ‌లో ఉన్న‌ప్పుడు జ్యోతిష్య శాస్త్ర ప్ర‌కారం కొన్ని రాశుల వారు కొన్ని ప‌నుల‌ను అస‌లు చేయ‌కూడ‌దు. అలా చేస్తే శ‌నీశ్వ‌రుడికి ఆగ్ర‌హం వ‌స్తుంది. దీంతో ఆయ‌న స‌మ‌స్య‌ల‌ను క‌ల‌గ‌జేస్తాడు.

శ‌ని తిరోగ‌మన దిశ‌లో ఉన్న స‌మ‌యంలో ఆయా రాశుల వారు అత్యాశ‌, అసూయ క‌లిగిన వ్య‌క్తుల‌కు దూరంగా ఉంటే మంచిది. వృద్ధుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ అవ‌మానించ‌కూడ‌దు. పేద‌ల‌ను, నిస్స‌హాయుల‌ను ఎగ‌తాళి చేయ‌కూడ‌దు. శ‌రీరంపై నియంత్ర‌ణ‌ను క‌లిగి ఉండాలి. ఎలాంటి వివాదాల్లోనూ త‌ల‌దూర్చ‌కూడ‌దు. గొడ‌వ‌ల‌కు దూరంగా ఉంటే మంచిది. అస‌భ్య‌క‌ర‌మైన లేదా చెడు మాట‌ల‌ను మాట్లాడ‌కూడ‌దు. జంతువులు, ప‌క్షులను హింసించ‌కూడ‌దు. రుషులు, ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రుల‌ను పూజించాలి.

న‌దీ స్నానం చేస్తే మంచిది..

శ‌ని తిరోగ‌మ‌న దిశ‌లో ఉన్న‌ప్పుడు ప‌విత్ర‌మైన న‌దుల్లో స్నానం చేస్తే ఆయ‌న ప్ర‌భావం ప‌డ‌కుండా ఉంటుంది. అలాగే ఒక ఇనుప గిన్నెలో ఆవాల నూనె నింపిన త‌రువాత అందులో మీ ముఖాన్ని చూసుకోవాలి. అనంత‌రం ఆ గిన్నెతోపాటు ఆ నూనెను దానం చేయాలి. ఈ స‌మ‌యంలో మీరు సుంద‌ర‌కాండ లేదా హ‌నుమాన్ చాలీసా చ‌దివితే మంచిది. శ‌నీశ్వ‌రుడి తిరోగ‌మ‌న స‌మ‌యంలో ఇనుము, మినుములు, ఆవాల నూనె, న‌ల్ల నువ్వులు, న‌ల్ల దుస్తులు, దుప్ప‌ట్లు దానం చేస్తే మంచిది. దీంతో శ‌ని సంతోషిస్తాడు. మీపై ఎలాంటి ప్ర‌భావం చూపించ‌డు. మిమ్మ‌ల్ని అనుగ్ర‌హిస్తాడు. క‌నుక ఈ స‌మ‌యంలో ఆయా రాశుల వారు శ‌ని విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM

త్రిష వర్సెస్ పార్థిబన్.. నటి సీరియస్ కౌంటర్! ‘మైక్ ఉంటే ఏదైనా మాట్లాడతారా?’

త‌మిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను న‌టి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేర‌కు త్రిష త‌న…

Monday, 9 March 2026, 3:22 PM

బెంగళూరులో ఎన్టీఆర్ మేనియా.. ఆసుపత్రి ఓపెనింగ్‌లో భారీ తోపులాట, ఎస్కలేటర్ ధ్వంసం!

నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…

Monday, 9 March 2026, 10:01 AM

బెల్లంకొండ ఇంట్లో పెళ్లి సందడి.. వైభవంగా శ్రీనివాస్ నిశ్చితార్థం..

టాలీవుడ్ న‌టుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్ట‌నున్నారు. త‌న ప్రియురాలు కావ్య‌తో ఆయ‌న నిశ్చితార్థం ఆదివారం (మార్చి…

Sunday, 8 March 2026, 8:36 PM

‘సోషల్ మీడియాకు దూరం’.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు! ఫైనల్‌కు ముందు అసలు రహస్యం ఇదే.

ఒత్తిడిని త‌గ్గించుకునేందుకు తాను ఫోన్‌నే కాదు, సోష‌ల్ మీడియాను కూడా దూరంగా పెట్టాన‌ని, ఇప్ప‌టికీ సామాజిక మాధ్య‌మాల‌ను చూడ‌డం లేద‌ని…

Sunday, 8 March 2026, 5:30 PM