lifestyle

Jonna Rotte : రోజూ రాత్రి పూట ఒక జొన్న రొట్టె తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

Jonna Rotte : ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ ఉన్న చాలా మంది ప్ర‌స్తుతం త‌మ ఆహార‌పు అల‌వాట్ల‌లో అనేక మార్పులు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే రోజూ రాత్రి పూట తినే ఆహారంలో చాలా మంది అన్నానికి బ‌దులుగా ఇత‌ర ఆహారాల‌ను తింటున్నారు. దీంతో బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు, ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అయితే మ‌న పూర్వీకులు ఒక‌ప్పుడు ఎక్కువ‌గా తిన్న ఆహారాల్లో జొన్న‌లు కూడా ఒక‌టి. అప్ప‌ట్లో బియ్యం అంద‌రి వ‌ద్ద ఉండేవి కావు. కానీ జొన్న‌లు దాదాపు అంద‌రి ఇళ్ల‌లోనూ ఉండేవి. దీంతో వారు జొన్న‌ల‌ను దంచి నిల్వ చేసి పెట్టుకునేవారు. దాంతో ర‌క‌ర‌కాల వంట‌లు చేసుకుని తినేవారు.

జొన్న‌ల‌తో చాలా మంది అప్ప‌ట్లో గ‌ట‌క‌, సంగ‌టి, రొట్టెలు చేసుకునేవారు. కానీ గ‌ట‌క‌, సంగ‌టి చేయ‌డం క‌ష్టంతో కూడుకున్న ప‌ని. అందుక‌ని ఇప్పుడు చాలా మంది జొన్న రొట్టెల‌ను చేసి తింటున్నారు. అయితే వాస్త‌వానికి జొన్న‌లు ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. ఇవి మ‌న‌కు ఎంతో బ‌లాన్నిస్తాయి. అందుక‌నే మ‌న పూర్వీకులు ఎంతో బ‌లంగా, ఆరోగ్యంగా ఉండేవారు. వారికి ఎలాంటి రోగాలు కూడా వ‌చ్చేవి కావు. ఇక రోజూ రాత్రి జొన్న రొట్టెల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Jonna Rotte

ఎముక‌ల‌కు చాలా బ‌లం..

జొన్న‌ల్లో ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది మ‌న‌కు ఎన్నో ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది శ‌రీరంలోని కొవ్వును క‌రిగించి అధిక బ‌రువును త‌గ్గిస్తుంది. ఫైబ‌ర్ వ‌ల్ల మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అలాగే ఫైబ‌ర్ వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ మొత్తం శుభ్రంగా మారుతుంది. జొన్న‌ల్లో క్యాల్షియం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను బ‌లంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువ‌ల్ల విరిగిన ఎముక‌లు ఉన్న‌వారు జొన్న రొట్టెల‌ను తింటే త్వ‌ర‌గా అతుక్కుంటాయి. ఎముక‌లు త్వ‌ర‌గా బ‌లంగా మారుతాయి.

షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి..

జొన్న‌ల్లో ఉండే ఫైబ‌ర్ చ‌క్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తుంది. దీంతో ర‌క్త‌నాళాల్లో ఉండే కొవ్వు క‌రిగిపోతుంది. దీని వ‌ల్ల హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీంతోపాటు డ‌యాబెటిస్ కూడా అదుపులోకి వ‌స్తుంది. షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారికి జొన్న‌లు వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. జొన్న రొట్టెల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల షుగ‌ర్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు. అలాగే శరీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. దీని వ‌ల్ల హైబీపీ సైతం త‌గ్గుతుంది. ఇలా జొన్న రొట్టెల‌ను రోజూ తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి క‌నుక రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఎలాంటి రోగాలు రావు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM