Lord Shani Dev : చాలామంది గ్రహాల కారణంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. నిజానికి కొన్ని గ్రహాల ప్రభావం వలన మనలో ఎన్నో మార్పులు కలుగుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు మొదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అనారోగ్య నివారణకి శని దేవుని శాంతి మంత్రం గురించి ఈరోజు చూద్దాం. శని వలన ఒళ్ళు నొప్పులు కూడా ఒక్కొక్క సారి కలుగుతూ ఉంటాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా చాలా మందిలో కలుగుతూ ఉంటాయి.
అటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకుంటే మంచిది. కొందరిలో ఏమవుతుందంటే ఏలినాటి శని, అష్టమ శని. కంటక శని, శని మహర్దశ, అంతర్దశ జరుగుతుంటే.. ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి కలుగుతూ ఉంటాయి. ఇలాంటి నొప్పులు ఉన్నప్పుడు నడుము నుండి పాదాల దాకా నూనెని పట్టించాలి. నువ్వుల నూనెని పట్టించి శని ఉపశమన మంత్రాన్ని చదవాలి.
రెండు గంటల తర్వాత వేడి నీళ్లతో స్నానం చేస్తే, నొప్పులకు చక్కటి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులని, వాపులని తగ్గించేందుకు నువ్వుల నూనె చాలా చక్కగా పని చేస్తుంది. నొప్పులతో బాధపడుతున్నప్పుడు నువ్వుల నూనె ని మీరు మర్దన చేస్తే చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా వృద్ధాప్య ఛాయలు కూడా రాకుండా ఉంటుంది. పిల్లలకి నువ్వులు నూనె ఉపయోగిస్తే ఎముకలు బలంగా మారుతాయి. అయితే ఒక్కొక్కసారి కొందరిలో ఈ శని ప్రభావం వలన బద్ధకం కూడా పెరుగుతుంది. ఇక ఈ మంత్రాన్ని మనం చూద్దాం.
శనైశ్చరో మహాభాగో! సర్వారిష్ట నివారకః ! కాకధ్వజో రుద్రరూపో! కలికల్మష నాశక!!
ధీరో గంభీరో ! ధృడసంకల్ప కారక !
దేవదేవో దుర్నిరీక్షో! దేవాసురవందిత!!
కరాళో కంటకో క్రుద్ధో! కష్టనష్టకారక !
పవిత్రో ప్రలోభో ! ప్రారబ్ధకర్మ ఫలప్రద!!
నిర్గుణో నిత్యతృత్పో! నిజతేజ ప్రకాశిత !
నిరుపమో నిష్కళంకో! నీలాంజన సమప్రభ !!
మందో మహావీరో! మదమాత్సర్య నాశక: ! ప్రసన్నో ప్రమోదో ! శరణాగత వత్సల!!
శనైశ్చర పంచకమిదం య: పఠేతృతం నర:
సర్వకష్ట వినిర్ముక్తో శ్రీ శనైశ్చర కరుణాం లభేత్!!
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…