Lord Ganesha : బుధ‌వారం నాడు ఈ ప‌రిహారం పాటించండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది.. ఆదాయం పెరుగుతుంది..!

April 6, 2024 9:17 AM

Lord Ganesha : స‌నాత‌న ధ‌ర్మంలో ఒక్కో దేవుడికి, దేవ‌త‌కి ఒక ప్ర‌త్యేక‌మైన రోజు నిర్ణ‌యించ‌బ‌డింది. అందులో బుధ‌వారాన్ని గణేశుడికి అంకింతం చేయ‌బ‌డింది. ఈ రోజున గ‌ణ‌ప‌తిని పూజించ‌డం వ‌ల్ల, జోతిష్య ప‌రిహారాలు చేయ‌డం వ‌ల్ల గ‌ణ‌ప‌తి యొక్క అనుగ్ర‌హం ఎల్ల‌ప్పుడూ మ‌న‌పై ఉంటుంది. అలాగే మ‌నం చేసే ప‌నులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్త‌వుతాయి. హిందూ ధ‌ర్మం ప్ర‌కారం ఏ శుభ కార్య‌మైనా గ‌ణ‌ప‌తి పూజతోనే ప్రారంభం అవుతుంది. గ‌ణ‌ప‌తిని తెలివితేట‌ల దేవుడు అని కూడా అంటారు. గ‌ణ‌ప‌తిని పూజించ‌డం వ‌ల్ల ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు తొలిగిపోతాయ‌ని విశ్వ‌సిస్తారు.

ఎవ‌రైతే వ్యాపారంలో న‌ష్టాల‌ను ఎదుర్కొంటారో అలాగే ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నించి అల‌సిపోతారో అలాంటి వారు బుధ‌వారం నాడు ఈ ప‌రిహారాలు చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. బుధ‌వారం నాడు గ‌ణ‌ప‌తి ఆల‌యానికి వెళ్లి పూజలు చేయాలి. అలాగే 7, 11 లేదా 21 సార్లు ప్ర‌ద‌క్షిణ‌లు చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జీవితంలో ఉండే క‌ష్టాల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే చేసే పనిలో విజ‌యాలు చేకూరుతాయి. అదేవిధంగా ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నించే వారు ఇంట‌ర్వ్యూకి వెళ్ల‌బోయే ముందు ఖ‌చ్చితంగా గ‌ణ‌ప‌తిని పూజించాలి. గ‌ణ‌ప‌తిని పూజించ‌డంతో పాటు నుదుటిపై సింధూరాన్ని ధ‌రించాలి. ఆ త‌రువాతే ఇంట‌ర్వ్యూకి బ‌య‌లుదేరాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మీరు ఖ‌చ్చితంగా ఇంట‌ర్వ్యూలో విజ‌యం సాధిస్తారు. అలాగే బుధ‌వారం నాడు ఆవుకు ప‌చ్చి మేత తినిపించ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితాలు ఉంటాయి.

Lord Ganesha follow this remedy on wednesday for luck
Lord Ganesha

ఏదైనా ప‌నికి వెళ్లే ముందు ఆవుకు ప‌చ్చిగ‌డ్డి తినిపించి వెళ్లాలి. అదేవిధంగా ద‌గ్గ‌ర్లో ఉండే గోశాల‌కు ప‌చ్చిగ‌డ్డిని దానం చేయాలి . ఇలా చేయ‌డం వ‌ల్ల చేసే ప‌నిలో విజ‌యం ల‌భించ‌డంతో పాటు పుణ్య ఫ‌లాలు ద‌క్కుతాయి. అలాగే జోతిష్య శాస్త్రం ప్ర‌కారం గ‌ణ‌ప‌తికి ఎంతో ఇష్ట‌మైన బుధ‌వారం నాడు ప‌చ్చి శ‌న‌గ‌ల‌ను, ఆకుప‌చ్చ‌రంగు దుస్తుల‌ను దానం చేయ‌డం వ‌ల్ల మ‌నం త‌ల‌పెట్టిన ప‌నుల‌న్నీ నెర‌వేరుతాయి. క‌ష్టాల నుండి ఉప‌వ‌మ‌నం క‌లుగుతుంది. జీవితంలో వ‌చ్చే స‌మ‌స్యలు దూర‌మ‌వుతాయి. అలాగే గ‌ణ‌ప‌తి యొక‌ర్క ఆశీస్సులు ఎల్ల‌పుడూ మీపై ఉండాలంటే బుధ‌వారం నాడు గ‌ణ‌ప‌తికి 11 లేదా 21 గ‌రికెల‌ను స‌మ‌ర్పించాలి. గ‌ణ‌ప‌తికి గ‌రికె అంటే చాలా ప్రీతి. గ‌ణ‌ప‌తికి గ‌రికెను స‌మ‌ర్పించ‌డం వ‌ల్ల మ‌న కోర్కెలు నెర‌వేరుతాయ‌ని జోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ విధంగా బుధ‌వారం నాడు గ‌ణ‌ప‌తిని పూజిస్తూ త‌గిన ప‌రిహారాలు చేయ‌డం వల్ల జీవితంలో క‌ష్టాలు తొలిగిపోయి సుఖ సంతోషాలు నెల‌కొంటాయ‌ని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now