House : ఈ సంకేతాలు కనబ‌డుతున్నాయా..? అయితే మీ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టే..!

July 15, 2023 8:17 PM

House : వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. వాస్తు ప్రకారం పాటిస్తే ఎటువంటి సమస్యకైనా కూడా పరిష్కారం లభిస్తుంది. చాలా మంది ఈ రోజుల్లో కూడా వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. వాస్తు ప్రకారం పాటిస్తే అనారోగ్య సమస్యలు మొదలు అనేక ఇబ్బందుల్ని తరిమికొట్టొచ్చు. కొన్ని సూచనల‌ ద్వారా మనం ఇంట్లో వాస్తు దోషం ఉంద‌ని చెప్పవ‌చ్చ‌ని జ్యోతిష్య పండితులు అంటున్నారు. కొంతమంది ఇళ్లల్లో సరైన వాస్తు ఉండదు. అలాంటప్పుడు నిత్యం వాళ్ళు అనేక బాధలు పడుతూ ఉంటారని పండితులు చెప్తున్నారు.

మీ ఇంట్లో కూడా వాస్తు దోషం ఉందేమో అనే సందేహం మీకు ఉందా..? అయితే కచ్చితంగా మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇటువంటి సంకేతాలు వాస్తు దోషం ఉన్న ఇళ్లల్లో కనపడతాయి. ఎక్కువగా అప్పులు చేయడం, మానసిక ఆందోళన వంటివి వాస్తు సరిగా లేకపోతే కనపడతాయి. ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం వంటివి కూడా వాస్తు సరిగా లేకపోతే ఉంటాయి. కుటుంబంలో తరచూ గొడవలు రావడం కూడా వాస్తు సరిగా లేదని చెప్తుంది.

if you are seeing these signs in your house then vastu dosha is there
House

వాస్తు దోషం కనుక ఉంటే ఇటువంటి సమస్యలు మీకు రోజూ కనబడతాయి. అలాంటప్పుడు వాస్తుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. వాస్తు దోషాలని పరిష్కరించుకోవాలి. దోష నివారణకి ఏం చేయాలి అనేది మీరు పండితులని అడిగి తెలుసుకోవాలి. వాస్తు దోషం ఉందని మనకు వచ్చే ఇబ్బందులను బట్టి మనం చెప్పొచ్చు. ఇంట్లో కుక్క ఎప్పుడూ ఒకే వైపుకి తిరిగి అరుస్తూ ఉన్నట్లయితే అక్కడ వాస్తు దోషం ఉందని చెప్పొచ్చు. ఇంట్లోకి పాములతోపాటు గబ్బిలాలు కూడా వస్తున్నట్లయితే కచ్చితంగా వాస్తు దోషం ఉందని చెప్పొచ్చు.

ఇంట్లో స్త్రీలు ఇబ్బంది పడుతున్నట్లయితే కూడా ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లు చెప్పవచ్చు. ఎప్పుడూ కూడా ఇంటిని నిర్మించుకునేటప్పుడు ఇంటి యజమాని పేరుని, నక్షత్రాన్ని బట్టి ఇంటిని వాస్తు ప్రకారం కట్టుకోవాలి. ముఖద్వారం ఏ వైపు ఉంటే మంచిది అనేది కూడా మొదట చూసుకోవాలి. ఇలా ముందే అన్నింటినీ తెలుసుకుని ఆ తర్వాత ఇల్లు కట్టుకోవాలి. అంతేకానీ స్థలం ఉంది కదా అని వాస్తు పండితులను సంప్రదించకుండా ఇల్లు కట్టుకుంటే అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now