జ్యోతిష్యం & వాస్తు

Athibala Plant : ఈ మొక్క అయ‌స్కాంతంలా ధ‌నాన్ని ఆక‌ర్షిస్తుంది.. ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌లొద్దు..!

Athibala Plant : మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న‌, పొలాల ద‌గ్గ‌ర‌, చేల‌ల్లో, ఖాళీ ప్ర‌దేశాల్లో క‌నిపించే ఔష‌ధ మొక్క‌ల‌ల్లో అతిబ‌ల మొక్క కూడా ఒక‌టి. చాలా మంది ఈ మొక్క‌ను పిచ్చి మొక్క‌గా, క‌లుపు మొక్క‌గా భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్క ప్ర‌యోజనాలు తెలిస్తే మాత్రం వెతికి మరీ ఇంటికి తెచ్చుకుంటారు. అతిబ‌ల మొక్క వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాలు అన్ని ఇన్ని కావు. ఆయుర్వేదంతో పాటు తంత్ర శాస్త్రంలో కూడా ఈ మొక్క‌ను ఉప‌యోగిస్తారు. అతిబ‌ల మొక్క‌ను ముదురు బెండ‌మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క‌కు ప‌సుపు రంగులో పూలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి బ‌లాన్నిఇవ్వ‌డంలో ఈ మొక్క మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఈ మొక్క ఆకుల ర‌సాన్ని వారానికి రెండు సార్లు తాగ‌డం వ‌ల్ల నీర‌సం, బ‌ల‌హీన‌త త‌గ్గి శ‌రీరానికి బ‌లం కలుగుతుంది.

మూత్ర‌పిండాల‌కు, క‌ళ్ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా ఈ మొక్క మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. అయితే ఆరోగ్య‌ప‌రంగా కాకుండా తంత్ర‌శాస్త్ర ప‌రంగా అతిబ‌ల మొక్కను ఎలా ఉప‌యోగించాలి…. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు దోషాలు, గ్ర‌హ దోషాలు, పితృ దోషాల కార‌ణంగా కొన్నిసార్లు మ‌నం ఎంత ముందుకు వెళ్లాల‌న్నా వెళ్ల‌లేక‌పోతూ ఉంటాము. మ‌న ద‌గ్గ‌ర డ‌బ్బుకు లోటు ఏర్ప‌డుతుంది. వ్యాపారంలో న‌ష్టాలు వ‌స్తూ ఉంటాయి. ఇటువంటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో అతిబ‌ల చెట్టు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. జాత‌క దోషాల‌ను, గ్ర‌హ దోషాల‌ను త‌గ్గించి మ‌న‌కు మేలు చేయ‌డంలో అతిబ‌ల మొక్క ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. జీవితంలో పురోగ‌తి కావాల‌నుకున్న వారు, ఆగిన ప‌నులు పూర్తి కావాల‌నుకునే వారు ఇప్పుడు చెప్పే తంత్రాన్ని పాటించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

Athibala Plant

దీని కోసం బుధ‌వారం నాడు సూర్యుడు ఆస్థ‌మించిన త‌రువాత వేర్ల‌తో స‌హా అతిబ‌ల మొక్క‌ను ఇంటికి తెచ్చుకోవాలి. త‌రువాత ఈ మొక్క వేర్ల‌ను గంగాజ‌లంతో శుభ్ర‌ప‌ర‌చాలి. గంగాజ‌లం అందుబాటులో లేని వారు మంచి నీటిలో క‌ర్పూరం, ప‌సుపు వేసి ఆ నీటితో వేర్ల‌ను శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా శుభ్ర‌ప‌రిచిన త‌రువాత ఈ మొక్క వేరు నుండి ముక్క‌ను తీసుకుని వెండి తాయ‌త్తులో ఉంచాలి. ఈ తాయ‌త్తును దేవుడి ముందు ఉంచి పూజించి మెడ‌లో లేదా చేతికి ధ‌రించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మీరు జీవితంలో పురోగ‌తిని సాధిస్తారు. ఆగిన ప‌నులు చ‌క్క‌గా పూర్త‌వుతాయి. అలాగే ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ ఉండ‌డం వ‌ల్ల ఇంట్లో ల‌క్ష్మీ దేవి అడుగు పెట్ట‌దు. దీంతో డ‌బ్బుకు లోటు ఏర్ప‌డుతుంది. అలాంట‌ప్పుడు శ‌నివారం నాడు సూర్యుడు అస్థ‌మించిన త‌రువాత అతిబ‌ల మొక్క వేరును ఇంటిని తీసుకువ‌చ్చి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత ఈ వేరును దేవుడి ద‌గ్గ‌ర ఉంచి పూజించాలి. ఇప్పుడు ఈ వేరును న‌ల్ల‌టి వ‌స్త్రంలో ఉంచి మూట క‌ట్టి ఇంటి ముంద‌ర క‌ట్టాలి.

ప్ర‌తి 21 రోజుల‌కొక‌సారి ఈ వేరును మారుస్తూ ఉండాలి. మ‌ర‌లా శ‌నివారం నాడు సూర్యుడు ఆస్థ‌మించిన త‌రువాతే కొత్త వేరును తీసుకువ‌చ్చి క‌ట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ తొల‌గిపోతుంది. ల‌క్ష్మీదేవిఇంట్లోకి అడుగు పెడుతుంది. డ‌బ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అలాగే వ్యాపారంలో న‌ష్టాలు అధికంగా ఉన్న వారు సోమ‌వారం నాడు అతిబ‌ల మొక్క వేరును తీసుకు వ‌చ్చి శుభ్రంగా క‌డిగి ఎర్ర‌టి వ‌స్త్రంలో మూట క‌ట్టాలి. త‌రువాత ఈ మూట‌ను మీరు మీ వ్యాపారంలో డ‌బ్బు ఉంచే చోట ఉంచాలి. 11 రోజుల‌కు లేదా 21 రోజుల‌కు ఈ మూట‌ను పారే నీటిలో వ‌దిలి రావాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వ్యాపారం మంచిగా సాగుతుంది. ఈ విధంగా అతిబ‌ల మొక్క మ‌న‌కు తంత్ర‌ప‌రంగా కూడా ఎంతో మేలు చేస్తుంద‌ని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM