Dimples : సొట్ట బుగ్గలు ఉంటే అదృష్టమా, దురదృష్టమా..?

July 26, 2023 5:27 PM

Dimples : ఫేస్ రీడింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చాలా సార్లు మనం ఫేస్ రీడింగ్ గురించి వింటూ ఉంటాము. మన ముఖాన్ని బట్టి మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. అవును అండి నిజమే మన ముఖంని చూసి మనం ఏమిటో తెలుసుకోవచ్చు. కావాలంటే మీరు ఓ లుక్ వేసేయండి. మీరు ఏమిటో ఇప్పుడే తెలుసుకోండి. ముఖంలో ఉండే బుగ్గలని బట్టి కూడా జీవితం ఎలా ఉంటుంది అనేది చెప్పొచ్చట.

ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ సొట్ట బుగ్గలు ఉంటే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందనేది, విష్ణుపురాణంలో చెప్పబడింది. ఆడవాళ్లు నవ్వగానే సొట్ట పడినట్లయితే వారు చాలా అదృష్టవంతులు అని విష్ణు పురాణంలో చెప్పబడింది. సొట్ట బుగ్గల ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలా కలిసి వస్తుందట.

having Dimples is it lucky or what
Dimples

సొట్ట బుగ్గలు ఉన్న వాళ్లు వారికి నచ్చిన విధంగానే జీవిస్తారు. ఎవరినీ బాధ పెట్టరు. వాళ్ళ జోలికి వస్తే అసలు ఊరుకోరు. ఎటువంటి గొడవలు కూడా వాళ్ళు పట్టించుకోరు. సొట్ట బుగ్గలు ఉన్న అమ్మాయి ఇంటికి కోడలు కింద వస్తే, అత్త కోడలికి గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఇక మగవారికి సొట్ట బుగ్గలు ఉంటే వారి తల్లి ఆయుష్షు ఎక్కువగా ఉంటుందట.

కుడిబుగ్గ సొట్టపడే వారు తల్లి మాట ఎక్కువగా వింటారు. అదే ఎడమ ఎడమ బుగ్గ సొట్ట పడితే భార్య మాట బాగా వింటారు. బుగ్గలు నిండుగా ఉండే వాళ్ళకి విశాల హృదయం ఉంటుంది. బుగ్గలు పలుచగా ఉండేవారు నలుగురితో కలిసి మెలిసి ఉండలేరు. ఎత్తుగా బుగ్గలు ఉంటే నిజాయితీకి మారుపేరుగా ఉంటారు. ఆచార వ్యవహారాల్లో వాళ్ళు ముందే ఉంటారు. ఇలా మనం బుగ్గలని బట్టి ఈ విషయాలని తెలుసుకోవచ్చు. మరి మీ మీరు ఏమిటో తెలుసుకున్నారా..?

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now