ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. ధ‌నం వ‌స్తూనే ఉంటుంది.. అదృష్టం మీ వెంటే ఉంటుంది..!

September 27, 2023 8:47 AM

ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. బాగా డబ్బులు ఉండి, ఆనందంగా ఉండాలని అనుకుంటారు. వాస్తు ప్రకారం మనం పాటిస్తే, డబ్బులు కూడా వస్తాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. సంపద పెరుగుతుంది. అదృష్టం కూడా ఉంటుంది. సంపద బాగా పెరుగుతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలంటే, ఆగ్నేయం వైపు రాగి తో చేసిన స్వస్తిక్ ని పెట్టండి. ఇలా చేయడం వలన డబ్బులు బాగా వస్తాయి. సంపదకి ఎలాంటి లోటు కూడా ఉండదు.

సంపద బాగా పెరగాలంటే, నీలం రంగు లో ఉండే డ‌బ్బాని ఉత్తరం వైపు పెట్టండి. లేదంటే, మీరు డబ్బులు దాచుకునే డబ్బాని కూడా ఉత్తరం వైపు పెట్టుకోవచ్చు. ఆ డబ్బా మీద నీలం రంగు కమలాన్ని పెట్టొచ్చు. ఇలా, మీరు డబ్బులు ఇందులో వేయడం మొదలుపెడితే, ఇక డబ్బులు అలా వస్తూనే ఉంటాయి. కాసుల వర్షం కురుస్తుంది.

follow these vastu tips in home for wealth and luck

చెత్తబుట్టని ఎప్పుడూ కూడా ఉత్తరం, పడమర, ఆగ్నేయం వైపు పెట్టకుండా చూసుకోండి. వీటన్నిటితో పాటుగా, ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు శుభ్రంగా లేకపోతే నెగటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తే, అది రిలేషన్ షిప్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్ని కూడా తీసుకువస్తుంది.

బెడ్ రూమ్, కిచెన్, రూఫ్ టాప్, బాల్కనీ, కిటికీలు, ముఖద్వారం ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకుంటూ ఉండాలి. ఇలా, ఈ విధంగా మీరు పాటించినట్లయితే కచ్చితంగా మంచి ఎనర్జీ వస్తుంది. సంపద కూడా బాగా పెరుగుతుంది. డబ్బు కి లోటు ఉండదు. మరి ఇక వీటిని గుర్తుపెట్టుకుని ఆచరించినట్లయితే, ఎంతో మంచి జరుగుతుంది. ఎలాంటి సమస్యలు కూడా మీకు కలగవు. సంతోషంగా ఉండొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now