బెడ్ రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటించండి.. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు రావు..!

September 26, 2023 3:44 PM

వాస్తు ప్రకారం నడుచుకుంటే, సమస్యలన్నిటికీ మంచి పరిష్కారం ఉంటుంది. చాలా మంది, వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. పండితులు చెప్పినట్లు చేయడం వలన చక్కటి పాజిటివ్ ఇంట్లోకి వస్తుంది. వాస్తు ప్రకారం, ఒత్తిడి లేకుండాసంతోషంగా ఉండాలంటే, ఇలా చేయడం మంచిది. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే, ఈ వాస్తు చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి. పైగా భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు కూడా రావు.

మాస్టర్ బెడ్ రూమ్ ఎప్పుడు, దక్షిణం వైపు ఉండడం మంచిది. ఇలా ఉంటే, భార్యాభర్తల మధ్య గొడవలు రావు. వైవాహిక జీవితంలో సమస్యలు కలగకూడదు అంటే, బెడ్ రూమ్ ప్రశాంతంగా ఉండాలి. స్క్వేర్ ఆకారంలో కానీ రెక్టాంగిల్ ఆకారంలో కానీ ఉండవచ్చు. మెటల్ బెడ్స్ ని అసలు ఉపయోగించడం మంచిది కాదు. ఒక క్వీన్ సైజ్ బెడ్ ని కొనుగోలు చేయడం మంచిది.

follow these vastu tips in bedroom for couple problems

చాలామంది, రెండు మంచాలను కలిపి వేసుకుంటూ ఉంటారు. అలా, వేరువేరుగా వేసుకోవడం వలన భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుందట. మంచానికి ఎదురుగా అద్దం లేకుండా చూసుకోవాలి. ఇలా ఉండడం వలన ఒత్తిడి పెరిగిపోతుంది. భార్య భర్తల మధ్య సమస్యలు కలుగుతాయి. పడమర వైపు భార్యాభర్తలు ఫోటోని పెట్టుకుంటే, ప్రేమ పెరుగుతుంది.

ఇక రంగుల విషయానికి వస్తే… భార్యాభర్తలు ప్రశాంతంగా ఉండడం కోసం పింక్ కలర్, పీచ్ కలర్ వంటివి వేయించుకోవడం మంచిది. దీని వలన ప్రశాంతత ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. సంతోషంగా భార్యాభర్తలు ఉండొచ్చు. అదేవిధంగా భార్యాభర్తలు వీటితో పాటుగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం కూడా చాలా అవసరం. సమస్య ఏమైనా వస్తే పరిష్కరించుకోవడానికి చర్చించుకుంటూ ఉండాలి. ఇలా వీటిని అనుసరించినట్లయితే, ప్రేమానురాగాలు బలపడతాయి. సంతోషంగా ఉండవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now