నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు మనం చాలా పనులు చేస్తాం. వాటిల్లో అనేకమైన రకాల పనులు ఉంటాయి. అయితే మీకు తెలుసా..? రోజూ మీరు చేసే కొన్ని పనుల వల్ల మీకు వాస్తు దోషం కలుగుతుందని..! అవును, మీరు విన్నది కరెక్టే. కొన్ని రకాల పనులు చేయడం వల్ల మీకు వాస్తు దోషం కలుగుతుంది. దీంతో ఏం చేసినా కలసి రాదు. దురదృష్టం వెన్నంటి ఉంటుంది. డబ్బు వృథాగా ఖర్చవుతుంది. మరి అలాంటి పనులు ఏవో ఇప్పుడు తెలుసుకుందామా.
పగిలిన వస్తువుల్లో ఆహారం తినరాదు. కాఫీ, టీ, జ్యూస్ లేదా నీరు వంటి ద్రవాలను కూడా తాగరాదు. అసలు పగిలిన వస్తువులను ఇంట్లోంచి వెంటనే తీసేయాలి. దీంతో లక్ కలసి వస్తుంది. లేదంటే దురదృష్టం వెంటాడుతుంది. ఏదీ కలసి రాదు. కారు లేదా బైక్ ఏవి ఉపయోగించినా చాలా మంది వాటిని తుడవకుండానే దుమ్ము, ధూళితో అలాగే వాటిని బయటకు తీసి వాటిపై వెళ్తారు. కానీ అలా చేయకూడదు. వాహనాలను క్లీన్ గా తుడిచాకే వాటిల్లో ప్రయాణించాలి. లేదంటే వాస్తు దోషం కలుగుతుందట. బ్యాడ్ లక్ వెన్నంటి ఉంటుందట.
చాలా మంది తల్లిదండ్రులు, పెద్దలు తమ పిల్లలను ఉదయాన్నే గదమాయిస్తూ, అరుస్తూ నిద్ర లేపుతారు. నిజానికి అలా చేయరాదట. ముఖంపై చిరునవ్వుతో మృదువుగా మాట్లాడుతూ నిద్ర లేపాలట. దీంతో ఆ పిల్లలు రోజంతా ఉత్సాహంగా ఉంటారట. వారు అనేక అంశాల్లో చక్కగా రాణిస్తారట. అలా మృదువుగా తట్టి లేపడం వల్ల వారిలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందట. దీంతో వారు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారట. ఉదయాన్నే ఇంటి నుంచి బయల్దేరి ఎక్కడికి వెళ్లినా ఉత్త చేతులతో వెళ్లకూడదు. కనీసం ఒక బాటిల్‌లో నీటిని అయినా వెంట తీసుకెళ్లాలి. దీంతో పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుంది. లక్ కలసి వస్తుంది.
చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేసి నేరుగా మధ్యాహ్నం లంచ్ చేస్తారు. అలా చేయకూడదు. ఉదయాన్నే కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిందే. దీంతో శరీరం ఉత్తేజంగా మారుతుంది. పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుంది. ఏ పనినైనా చేసే శక్తి వస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ చేసేంత టైమ్ లేకపోతే కనీసం పండ్లను అయినా తినాలి. చాలా మంది తాము రోజూ వెంట తీసుకెళ్లే బ్యాగుల్లో వృథా పేపర్లు, కవర్లు, ఇతర వస్తువులు పెడతారు. అలా ఉంచరాదు. బ్యాగును రోజూ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. శుభ్రంగా ఉన్న బ్యాగుతోనే బయటకు వెళ్లాలి. అందులో చెత్త వస్తువులు ఉండరాదు. ఇలా చేస్తే లక్ కలసి వస్తుందట.
ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు గతం రోజు ఆఫీస్‌లో జరిగిన సంఘటనలను మరిచిపోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీస్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫ్రెష్‌గా ఉండాలి. తాజాగా పని ప్రారంభించాలి. దీంతో అదృష్టం కలసి వస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసే వారు ఎట్టి పరిస్థితిలోనూ ప్లేట్‌లో పెట్టుకున్న ఆహారాన్ని వదిలిపెట్టరాదు. మొత్తం తినేయాలి. లేదంటే బ్యాడ్ లక్ వెన్నంటి ఉంటుంది. ఏదీ కలసి రాదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…