Lord Surya : హిందూ పురాణాల్లో సూర్య దేవునికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చాలా మంది సూర్యున్ని రోజూ పూజిస్తారు, ప్రార్థిస్తారు కూడా. కొందరు సూర్య నమస్కారాలు చేస్తారు. నిజానికి సూర్యుడు జ్ఞానానికి ప్రతీక. ఆయన్ను పూజిస్తే జ్ఞానం, సంపద లభిస్తాయని నమ్ముతారు. ఆ కోవలోనే చాలా మంది సూర్యున్ని నిత్యం పూజిస్తారు. అయితే పలు రకాల లోహాలతో చేసిన సూర్యుని బొమ్మలను పూజించినా కూడా ముందు చెప్పిన విధంగా లాభాలు కలుగుతాయట. మరి సూర్యునికి చెందిన ఏ తరహా బొమ్మలను పూజించాలో ఇప్పుడు తెలుసుకుందామా.
స్థోమత ఉన్న వారు బంగారంతో చేసిన సూర్యుని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజించాలి. దీంతో అమితమైన సంపద కలుగుతుంది. ఇంట్లో ఉన్న వారికి జ్ఞానం సిద్ధిస్తుంది. కొత్తగా పెళ్లయిన దంపతులు రాగితో చేసిన సూర్యుని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించాలి. దీంతో వారి వైవాహిక జీవితం బాగుంటుంది. పిల్లలు త్వరగా కలుగుతారు. కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. వెండితో చేసిన సూర్యుని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే సమాజంలో అందరి మధ్య గౌరవం పెరుగుతుంది. పేరు, ప్రఖ్యాతులు వస్తాయి. కెరీర్ బాగుంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగులు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.
రాయి లేదా మట్టితో చేసిన సూర్యుని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే లక్ కలసి వస్తుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎలాంటి సమస్యలు ఎదురు కావు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. చెక్కతో చేసిన సూర్యుని బొమ్మను ఇంట్లో పెట్టుకుని ప్రార్థిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. అదృష్టవంతులుగా మారుతారు. అనుకున్నవి నెరవేరుతాయి. జీవితాంతం కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. గ్లాస్ లేదా ఇనుము తో చేసిన సూర్యుని బొమ్మలు, విగ్రహాలను మాత్రం ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. వీటి వల్ల దురదృష్టం వెంటాడుతుంది. ఏది చేసినా కలసి రాదు. అనుకున్న పనులు పూర్తి కావు. అన్నీ సమస్యలే ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుండదు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…