Toll Gate : ఈ రెండు సందర్భాల్లో టోల్ గేట్ కట్టనవసరం లేదు.. తెలియక చాలా మంది కట్టేస్తుంటారు..

March 16, 2023 8:18 AM

Toll Gate : టోల్ గేట్లు ఉన్న చోట టోల్ ట్యాక్స్ కట్టకుండా వెహికిల్ తో వెళ్లడం చాలా కష్టం. ఎవరైనా టోల్ కట్టాల్సిందే. ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్రపతి ఇలా కొందరు ప్రముఖులు తప్ప ప్రతి ఒక్కరు టోల్ ట్యాక్స్ కట్టి తీరాల్సిందే. ప్రభుత్వం ప్రజల రవాణా సౌకర్యార్థం ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త‌గా నిర్మించిన లేదా నిర్మించ‌బోయే జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ టాక్స్ వేస్తార‌ని మనకు తెలుసు. అయితే ఈ రోడ్లపై టోల్ ట్యాక్స్ కట్టడానికి మనకు కూడా మినహాయింపు ఉంటుంది. కానీ అదెప్పుడు పడితే అప్పుడు కాదు. ఒకట్రెండు సంధర్బాలలో మాత్రమే. ఆ రెండు సంధర్బాలు ఏంటో తెలుసుకుని, మీకు ఇకపై అలాంటి పరిస్థితి ఎదురైతే టోల్ కట్టకుండా ఎంచక్కా వెళ్లిపోండి. ఎవరన్నా ఏమన్నా అడిగితే రూల్స్ చెప్పండి.

టోల్ గేట్ నుంచి 200 మీట‌ర్ల దూరం వ‌ర‌కు ట్రాఫిక్ జామ్ అయితే మనం టోల్ క‌ట్ట‌కుండానే గేట్ దాటి వెళ్ల‌వ‌చ్చు. టోల్ గేట్ కు కొద్ది దూరంలో ఒక పసుపు రంగు లైన్ ఉంటుంది. ఆ లైన్‌కు అవ‌త‌ల ఎవ‌రైనా 5 లేదా అంత‌క‌న్నా ఎక్కువ నిమిషాల పాటు వేచి ఉన్న‌ట్ట‌యితే వారు కూడా టోల్ క‌ట్టాల్సిన ప‌నిలేదు. నేరుగా గేట్ నుంచి వెళ్లిపోవ‌చ్చు. కాబట్టి మీకు ఎప్పుడైనా ఇలాంటి సంద‌ర్భాలు గనక ఎదురైతే టోల్ చెల్లించ‌కండి. ఒక వేళ టోల్ సిబ్బంది ఇబ్బంది పెట్టినా, వాదించినా.. ఈ 2 రూల్స్ ను క‌చ్చితంగా చెప్పండి.

you do not need to pay toll taxes at toll gate in these two situations
Toll Gate

సందు దొరికితే సామాన్యున్ని బాదడానికి చూసే టోల్ సిబ్బంది అంత సులువుగా మనల్ని వదులుతారా అంటే అనుమానమే. ఎందుకంటే మనమేం రూల్స్ ఫాలో అవ్వాలో చెప్తారు కానీ, వాళ్ల గురించి మనం రూల్స్ మాట్లాడితే మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఒక టోల్ వ్యవస్థే కాదు ప్రతి వ్యవస్థ ఇలాగే ఉంది. క‌నుక ఇవి తెలుసుకుని ముందు సాగ‌డం మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment