ప్రస్తుతం కరోనా కష్ట సమయాలలో ప్రజలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రస్తుతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయినటువంటి ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటివాటి ద్వారా అధిక మొత్తంలో డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొన్ని పొరపాట్ల కారణంగా డబ్బులు సరైన ఖాతాల్లో కాకుండా వేరే ఖాతాలలో పడటం జరుగుతుంటాయి.
ఈ విధంగా డబ్బులు ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్ కు వెళితే కొందరు ఆ డబ్బులను రిటర్న్ చేయడానికి ఒప్పుకోరు. మరి కొందరు మన డబ్బులను మనకు రిటర్న్ చేయడానికి అంగీకరిస్తారు. ఈ క్రమంలోనే పొరపాటున ఈ విధమైన తప్పిదాలు జరిగి డబ్బులు ఒక ఖాతా కాకుండా మరొక ఖాతాలో పడినట్లయితే బాధితులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ విషయాన్ని సదరు బ్యాంక్ మేనేజర్ కు తెలియజేయాలి.
బాధితులు బ్యాంకు మేనేజర్ ను సంప్రదించి ఈ విషయం గురించి ఫిర్యాదు చేసి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను బ్యాంకు మేనేజర్ కు అందించాల్సి ఉంటుంది. ఇలా ఫిర్యాదు చేసినప్పుడే తిరిగి మన డబ్బులు మన అకౌంట్ కు వస్తాయి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా IFSC కోడ్ తప్పుగా ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా డబ్బులు వేరొకరి ఖాతాలో జమ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…