ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త‌.. బ్రాంచ్ మారాల‌నుకుంటే ఆన్‌లైన్‌లో ఇలా చేయ‌వ‌చ్చు..!

May 10, 2021 1:08 PM

దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఐ త‌న ఖాతాదారుల‌కు శుభ‌వార్త చెప్పింది. ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు ఇక‌పై త‌మ బ్యాంక్ బ్రాంచ్‌ను మార్చుకోవాల‌నుకుంటే బ్యాంకు దాకా వెళ్లాల్సిన ప‌నిలేదు. ఆన్‌లైన్‌లోనే ప‌ని పూర్త‌వుతుంది. అవును. ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్‌కు మారాల‌నుకుంటే ఆన్‌లైన్‌లోనే రిక్వెస్ట్ పెట్టి ప‌ని పూర్తి చేసుకోవ‌చ్చు. క‌రోనా నేప‌థ్యంలోనే ఈ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నామ‌ని ఎస్‌బీఐ తెలియ‌జేసింది.

state bank of india customers can change their branch online in this way

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు త‌మ బ్యాంక్ బ్రాంచ్‌ను మార్చుకోవాల‌నుకుంటే ఇలా చేయాలి.

1. ముందుగా onlinesbi.com అనే సైట్‌ను సంద‌ర్శించాలి.

2. అందులో పర్స‌న‌ల్ బ్యాంకింగ్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.

3. యూజ‌ర్ నేమ్‌, పాస్‌వ‌ర్డ్‌పై క్లిక్ చేయాలి.

4. అనంత‌రం వచ్చే ఆప్ష‌న్ల‌లో ఇ-స‌ర్వీస్ ట్యాబ్‌ను ఎంచుకుని దానిపై క్లిక్ చేయాలి.

5. ట్రాన్స్‌ఫ‌ర్ సేవింగ్స్ అకౌంట్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.

6. ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌నుకున్న అకౌంట్‌ను ఎంచుకోవాలి.

7. ఏ బ్రాంచ్‌కు అయితే మారాల‌నుకుంటున్నారో ఆ బ్రాంచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ను ఎంట‌ర్ చేయాలి.

8. ఒక‌సారి వివ‌రాలు అన్నింటినీ చెక్ చేసుకుని క‌న్‌ఫాం బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

9. రిజిస్టర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని ఎంట‌ర్ చేసి క‌న్‌ఫాం చేయాలి.

10. కొన్ని రోజుల త‌రువాత మీరు కావాల‌నుకున్న బ్రాంచ్‌కు మీ అకౌంట్ మారుతుంది.

ఇక యోనో యాప్ లేదా యోనో లైట్ యాప్‌ల‌ను వాడేవారు కూడా మీ అకౌంట్ బ్రాంచ్‌ను మార్చుకోవ‌చ్చు. అందుకు మొబైల్ నంబ‌ర్ క‌చ్చితంగా బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయి ఉండాలి. లేదంటే ఓటీపీ రాదు. కాగా క‌రోనా నేప‌థ్యంలో ఎస్‌బీఐ ఇప్ప‌టికే చాలా సేవ‌ల‌ను ఆన్‌లైన్ ద్వారానే అందిస్తోంది. అందులో భాగంగానే అకౌంట్ ట్రాన్స్ ఫ‌ర్ సేవ‌ను కూడా ఆన్‌లైన్ చేసింది. దీంతో ఖాతాదారులు త‌మ అకౌంట్ ను ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్‌కు సుల‌భంగా మార్చుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment