ఆ విషయంలో SBI కీలక నిర్ణయం.. ఫోన్ నంబర్లు లేకపోతే ఆ సేవలు పొందలేరు..

July 26, 2021 11:04 AM

SBI కస్టమర్లకు హెచ్చరిక. దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త రూల్స్ ను అమలులోకి తీసుకు వచ్చింది. ప్రస్తుత కాలంలో ఎక్కువగా నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, చేయటం వల్ల ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మోసాలను అరికట్టడం కోసమే SBI కీలక నిర్ణయం తీసుకుని కస్టమర్లకు హెచ్చరికలను జారీ చేసింది.

ఇదివరకు మాదిరిగా ఇకనుంచి SBI కస్టమర్లు మొబైల్ బ్యాంక్ సర్వీసులను పొందడం కొద్దిగా కష్టతరం కానుంది.SBI అకౌంట్ కు లింక్ అయిన ఫోన్ నెంబర్ మీ స్మార్ట్ ఫోన్ లో తప్పకుండా ఉండాలని SBI సూచిస్తుంది. మీ ఫోన్ నెంబర్ మీ సెల్ ఫోన్ లో ఉన్నప్పుడు మాత్రమే మీరు యోనో సేవలను పొందే అవకాశం ఉంటుంది. లేదంటే SBI యోనో సేవలను పొందలేరు.

బ్యాంకింగ్ మోసాలు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టడం కోసం స్టేట్ బ్యాంక్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుందని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ఈ నిర్ణయం తర్వాత యోనో యాప్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసింది. ఇక నుంచి మీరు యోనో యాప్ సేవలను పొందాలనుకుంటే బ్యాంక్ అకౌంట్ తో రిజిస్టర్ చేయించుకున్న మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీ సెల్ ఫోన్ లో ఉంటేనే ఈ సేవలను పొందగలరని ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ తమ కస్టమర్లకు హెచ్చరించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now