ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. ఈ 4 యాప్ ల‌ను ఫోన్‌లో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇన్‌స్టాల్ చేయ‌కండి..!

September 7, 2021 3:00 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. అందులో భాగంగా 4 యాప్‌ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయ‌కూడ‌ద‌ని సూచించింది. గ‌త 4 నెల‌ల కాలంలో 150 మందికి పైగా ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు రూ.70 ల‌క్ష‌ల‌కు పైగా సైబ‌ర్ మోసాల బారిన ప‌డి న‌ష్ట‌పోయారు. అందువ‌ల్ల స‌ద‌రు యాప్ ల‌ను ఇన్‌స్టాల్ చేయ‌కూడ‌ద‌ని ఎస్‌బీఐ చెబుతోంది.

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. ఈ 4 యాప్ ల‌ను ఫోన్‌లో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇన్‌స్టాల్ చేయ‌కండి..!

ఎనీ డెస్క్‌, క్విక్ స‌పోర్ట్‌, టీమ్ వ్యూయ‌ర్‌, మింగిల్ వ్యూ.. ఈ నాలుగు యాప్ ల‌ను ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయ‌రాదు. వీటి స‌హాయంతో మోస‌గాళ్లు ఫోన్‌ను ఆధీనంలోకి తీసుకుని యూపీఐ ద్వారా డ‌బ్బుల‌ను కాజేస్తున్నార‌ని ఎస్‌బీఐ తెలియ‌జేసింది. అందువ‌ల్ల ఆ యాప్‌ల‌ను ఫోన్ లో ఇన్‌స్టాల్ చేయ‌కూడ‌ద‌ని ఎస్‌బీఐ సూచించింది.

ఇటీవ‌లి కాలంలో సైబ‌ర్ మోసాలు పెరిగిపోయిన నేప‌థ్యంలో ఎస్‌బీఐ పై విధంగా త‌న క‌స్ట‌మ‌ర్లకు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఇక చాలా మంది క‌స్ట‌మ‌ర్లు ఏదైనా స‌హాయం అవ‌స‌రం అయి టోల్ ఫ్రీ నంబర్ కావల్సి వ‌స్తే గూగుల్‌లో వెదుకుతున్నార‌ని, అలా చేయ‌కూడ‌ద‌ని, ఎస్‌బీఐకి చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన నంబ‌ర్‌ల‌కే కాల్ చేయాల‌ని కూడా సూచించింది. ఇక ఏదైనా ఫ్రాడ్ జ‌రిగితే ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు 1800111109, 9449112211, 08026599990 అనే నంబ‌ర్ల‌కు కాల్ చేయ‌వ‌చ్చు. లేదా 155260 నంబ‌ర్‌కు డ‌య‌ల్ చేసి నేష‌న‌ల్ సైబ‌ర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్ట‌ల్‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని ఎస్‌బీఐ తెలియ‌జేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now