Post Office RD Scheme : మీరు పోస్ట్ ఆఫీస్ ప్రవేశ పెట్టిన ఏ ప్లాన్‌లో అయిన సరే డబ్బు పెట్టుబడి పెడితే మీ డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోస్ట్ ఆఫీస్‌లో అనేక పథకాలు ఉన్నాయి. చాలా మంది పెట్టుబడిదారులు తమకు తక్కువ రిస్క్ ఉన్న మంచి రాబడిని పొందగల ఎంపిక కోసం చూస్తున్నారు. పోస్టాఫీస్ లో అదిరిపోయే పథకం అందుబాటులో ఉంది. అదే రికరింగ్ డిపాజిట్ స్కీం. పోస్టాఫీస్ ఆర్డీ పథకం కింద ఐదేళ్ల పాటు ప్రతి నెల కూడా వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభం ఉంటుంది. ఈ పథకం కింద పోస్ట్ ఆఫీస్ 6.7 శాతం వార్షిక వడ్డీ రేటుని రాబడిగా ఇస్తుంది.
సింగిల్, జాయింట్ అకౌంట్‌కి కూడా ఈ వడ్డీ రేటు కాలనుగుణంగా మారుతూ ఉంటుంది. మూడేళ్ల తర్వాత దీనిని రీడిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు ప్రతి నెల వెయ్యి రూపాయల పాటు 5 సంవత్సరాలు చెలిస్తే 6.7 శాతం అంటే మీరు ఊహించని ప్రాఫిట్ దక్కుతుంది ఉదాహరణకి మీరు ప్రతి నెల రూ1000గా ఐదేళ్లకి అరవై వేలు పెట్టుబడి పెట్టారు. ఈ లెక్కన చూస్తే రూ.11369 వడ్డీ రేటుని పొందవచ్చు. అంటే 71369 రూపాయలు ప్రాఫిట్ దక్కుతుంది. ఇలా మీరు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టిన కూడా మంచి లాభం వస్తుంది.
దీనికి సంబంధించి కేంద్రం 3 నెలలకొకసారి వడ్డీరేట్లను సవరిస్తుంది. ఇందులో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు మాత్రమే. మెచ్యూరిటీ తర్వాత కావాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది.. కాకపోతే ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టే వీలుంది. సింగిల్ అకౌంట్ కింద ఒకరు, జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా ముగ్గురు ఈ స్కీంలో చేరొచ్చు. మైనర్ పేరిట గార్డియెన్ ఖాతా తెరవొచ్చు.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…