ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటే కచ్చితంగా డెబిట్ కార్డ్ ఉండాలి. ఒకవేళ కార్డు అందుబాటులో లేకపోయినా యాప్ ద్వారా కోడ్ జనరేట్ చేసుకొని డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో డెబిట్ కార్డు అవసరం లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకొనే సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానుంది.ఎన్‌సీఆర్ కార్పొరేషన్ సంస్థ తొలి ఇంటర్ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయెల్ సర్వీసులను ఆవిష్కరించింది. ఈ సేవల ద్వారా యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు ఎటిఎం నుంచి డబ్బులు పొందవచ్చు.
ఇప్పటికే సిటీ యూనియన్ బ్యాంక్ ఎన్‌సీఆర్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ బ్యాంకు కస్టమర్ అలాగే తొలిసారిగా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ బ్యాంకు 1500 ఏటీఎంలను కొత్త ఫీచర్ తో అప్‌గ్రేడ్ చేయనుంది. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలని భావిస్తే మన మొబైల్లో యూపీఐ యాప్ ద్వారా డబ్బులు పొందవచ్చు.
ఈ అప్ ద్వారా మన మొబైల్ లో ఉన్నటువంటి భీమ్, గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి యాప్స్ తెరిచి ఏటీఎం పై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి అమౌంట్ ఎంటర్ చేయాలి. అయితే ఐదు వేల రూపాయల వరకు మాత్రమే తీసుకోవచ్చు.తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్ చేసి యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…