కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా రూ.10 లక్షల రుణం పొందండి..

July 26, 2021 4:43 PM

మీరు కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? అయితే మోడీ సర్కార్ మీకు ఒక శుభవార్తను తెలియజేస్తుంది. కొత్తగా వ్యాపారం చేయాలనుకొనే వారికి పది లక్షల రూపాయలను రుణ సదుపాయం కల్పించి, వ్యాపారం చేసేవారికి ప్రోత్సాహం కల్పిస్తోంది. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ ముద్రా యోజన పథకం ద్వారా వ్యాపారం చేయాలనుకునే వారికి లోన్ సౌకర్యం కల్పిస్తోంది.

ముద్రా స్కీమ్ పథకం ద్వారా మీరు ఏకంగా పది లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఈ పథకం ద్వారా లోన్ పొందే వారికి వివిధ రకాల బ్యాంకులను బట్టి వడ్డీ రేట్లను వసూలు చేస్తారు. ఈ స్కీమ్ ద్వారా తీసుకునే లోన్ పై కనీస వడ్డీ రేటు 12 శాతం ఉంటుందని చెప్పవచ్చు. ముద్ర స్కీమ్ కింద మూడు కేటగిరీల ద్వారా మనం లోన్ పొందవచ్చు.

ఈ పథకంలో శిశు, కిషోర్, తరుణ్ అనే మూడు కేటగిరీలు ఉంటాయి. శిశు కేటగిరి ద్వారా మనం 50 వేల వరకు రుణ సదుపాయం పొందవచ్చు. అదేవిధంగా కిషోర్ కేటగిరి ద్వారా ఐదు లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇక తరుణ్ ద్వారా పది లక్షల వరకు రుణం పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ లోన్ పొందాలనుకునేవారు బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఈ క్రింది తెలిపిన వెబ్ సైట్ ఆధారంగా లోన్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. https://www.mudra.org.in/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now