ఎల్ఐసీ పాల‌సీ హోల్డ‌ర్ల‌కు శుభ‌వార్త‌.. కొత్త‌గా రెండు క్రెడిట్ కార్డులు అందుబాటులోకి..!

July 30, 2021 9:55 PM

ఎల్ఐసీ పాల‌సీ హోల్డ‌ర్లు, ఏజెంట్లు, ఉద్యోగుల‌కు ఆ సంస్థ శుభ‌వార్త చెప్పింది. వారికి కొత్త‌గా రెండు క్రెడిట్ కార్డుల‌ను అందుబాటులోకి తెచ్చిన‌ట్లు వివ‌రించింది. ఎల్ఐసీ కార్డ్స్ స‌ర్వీసెస్ లిమిటెడ్‌, ఐడీబీఐ బ్యాంకు రెండూ క‌లిసి సంయుక్తంగా ఆ కార్డుల‌ను లాంచ్ చేశాయి. లుమైన్ ప్లాటినం క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ సీఎస్ఎల్ ఎక్లాట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వ‌చ్చాయి.

lic and idbi jointly launched new credit cards

ఈ క్రెడిట్ కార్డుల ద్వారా క‌స్ట‌మర్ల‌కు ప‌లు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. లుమైన్ కార్డుతో ప్ర‌తి రూ.100 ఖ‌ర్చు చేస్తే 3 డిలైట్ పాయింట్ల‌ను ఇస్తారు. అదే ఎక్లాట్ కార్డుతో అయితే 4 పాయింట్ల‌ను ఇస్తారు. ఈ కార్డుల‌ను ఉప‌యోగించి ప్రీమియం చెల్లిస్తే రివార్డు పాయింట్లు రెట్టింపు మొత్తంలో ల‌భిస్తాయి.

ఇక లుమైన్ కార్డుదారులు 60 రోజుల్లో రూ.10వేలు ఖ‌ర్చు చేస్తే 1000 వెల్‌క‌మ్ బోన‌స్ పాయింట్ల‌ను ఇస్తారు. ఎక్లాట్ కార్డుకు అయితే 1500 పాయింట్ల‌ను ఇస్తారు. ఇక రెండు కార్డుల‌కు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ క‌వ‌ర్‌, ప‌ర్స‌న‌ల్ యాక్సిడెంట్ లేదా ప‌ర్మినెంట్ డిజేబిలిటీ క‌వ‌ర్‌, క్రెడిట్ షీల్డ్ క‌వ‌ర్‌, జీరో లాస్ట్ ల‌య‌బిలిటీ వంటి స‌దుపాయాల‌ను అందిస్తున్నారు.

ఈ కార్డుల‌తో ఫ్యుయ‌ల్ కోసం ఖ‌ర్చు చేస్తే 1 శాతం ప‌న్ను ర‌ద్దు చేస్తారు. రూ.400 ఆపైన చేసే ఇంధ‌న ఖ‌ర్చుల‌కు ఇది వర్తిస్తుంది. రూ.3000 అంత‌క‌న్నా ఎక్కువ మొత్తంలో చేసే ట్రాన్సాక్ష‌న్ల‌ను సుల‌భంగా ఈఎంఐల‌కు మార్చుకోవ‌చ్చు. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, ఫోర్ క్లోజ‌ర్ ఫీజు ఉండ‌దు. కార్డు హోల్డ‌ర్లు ఏవైనా వ‌స్తువుల‌ను కొంటే 3, 6, 9, 12 నెల‌ల ఈఎంఐ స‌దుపాయాన్ని పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now