మ‌హిళ‌ల‌కు ఎల్ఐసీ అందిస్తున్న స్కీమ్‌.. రోజుకు రూ.29 పెడితే రూ.4 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు.. ఎలాగో తెలుసుకోండి..!

July 11, 2021 7:34 PM

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఎల్ఐసీ) ఆఫ్ ఇండియా దేశంలోని పౌరుల‌కు ర‌క ర‌కాల స్కీమ్‌ల‌ను అందుబాటులో ఉంచింది. దీంతో వారు పెట్టుబ‌డి పెట్టే డ‌బ్బుల‌కు అధిక మొత్తంలో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక మ‌హిళ‌ల‌కు అలాంటి ఓ స్కీమ్‌ను ఎల్ఐసీ అందిస్తోంది. 8 నుంచి 55 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న మ‌హిళ‌లు ఈ స్కీమ్‌లో డ‌బ్బుల‌ను పొదుపు చేసుకోవ‌చ్చు. ఆధార్ షీలా పేరిట ఈ స్కీమ్ అందుబాటులో ఉంది.

lic aadhar shila scheme for women gives good benefits

మ‌హిళ‌లు ఈ స్కీమ్‌లో రోజుకు రూ.29 పొదుపు చేస్తే చాలు, రూ.4 ల‌క్ష‌ల‌ను స్కీమ్ మెచూరిటీ తీరాక పొంద‌వ‌చ్చు. మెచూరిటీ తీర‌క ముందే ఖాతాదారు మ‌ర‌ణిస్తే ఆమె కుటుంబంలోని వారికి ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తారు. వారు చేసిన పొదుపును బ‌ట్టి క‌నీసం రూ.75వేల నుంచి రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు అందిస్తారు.

ఈ స్కీమ్‌లో భాగంగా క‌నీసం 10 ఏళ్లు డ‌బ్బును పొదుపు చేయాలి. గ‌రిష్టంగా 20 ఏళ్ల పాటు పొదుపు చేసుకోవ‌చ్చు. ఈ స్కీమ్‌కు కేవ‌లం ఆధార్ కార్డు ఉంటే చాలు, పొదుపు చేయ‌డం ప్రారంభించ‌వ‌చ్చు. ఇది ఒక గ్యారంటీడ్ ఎండోమెంట్ ప్లాన్‌. మ‌హిళ‌లు త‌మ‌కు స‌మీపంలో ఉన్న ఎల్ఐసీ ఏజెంట్ ద్వారా లేదా స‌మీపంలోని ఎల్ఐసీ బ్రాంచ్‌ను సంప్ర‌దించి ఈ స్కీమ్‌ను ప్రారంభించ‌వ‌చ్చు.

మెచూరిటీ తీరాక రూ.4 ల‌క్ష‌లు చేతికి అందాలంటే ఏడాదికి రూ.10,959 పెట్టాలి. అలా 20 ఏళ్ల పాటు పొదుపు చేయాలి. దీంతో రోజుకు రూ.29 పొదుపు చేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో ఎల్ఐసీకి 20 ఏళ్ల‌లో రూ.2,14,696 చెల్లిస్తారు. ఫ‌లితంగా మెచూరిటీ తీరాక రూ.4 ల‌క్ష‌లు చేతికి అందుతాయి. ఇలా ఈ ప‌థ‌కంలో లాభం పొంద‌వ‌చ్చు. ఇందులో భాగంగా నెల‌కు, 3 నెల‌ల‌కు ఒకసారి, 6 నెల‌ల‌కు ఒక‌సారి ప్రీమియంను చెల్లించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now