మీ ఇంట్లోనే క్రిస్ట‌ల్ క్లియ‌ర్ ఐస్‌ను ఇలా త‌యారు చేసుకోండి..!

August 8, 2021 10:00 PM

ఫ్రిజ్‌లు ఉన్నవారు సహజంగానే అప్పుడప్పుడు ఐస్‌ క్యూబ్స్‌ చేసుకుని ఉపయోగిస్తుంటారు. కొందరు వాటిని అందం కోసం వాడితే కొందరు మద్యం సేవించేందుకు ఉపయోగిస్తారు. ఇక కొందరు వాటిని సాధారణ నీటిలో వేసుకుని తాగుతారు. అయితే ఫ్రిజ్‌లో తయారు చేసే ఐస్‌ క్యూబ్స్‌ అంత క్రిస్టల్‌ క్లియర్‌గా ఉండవు. కానీ కింద తెలిపిన ట్రిక్‌ను పాటిస్తే అవి క్రిస్టల్‌ క్లియర్‌గా ఉండేలా తయారు చేయవచ్చు. అది ఎలాగంటే..

here it is how to make crystal clear ice at home

ఐస్‌ ట్రేలో ఉన్న బ్లాక్‌లలో రంధ్రాలు చేయాలి. దీంతో గడ్డకట్టని నీరు కిందకు వస్తుంది. ఆ నీరు కింద పడేలా ట్రేను ఇంకో బాక్స్‌లో ఉంచాలి. అయితే ట్రే కింద ఇన్సులేటెడ్‌ షీట్‌ను ఉంచాలి. ఈ షీట్‌ టీవీల వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులో వచ్చే బాక్స్‌లలో ఉంటుంది. దాన్ని కట్‌ చేసి ట్రే కింద పెట్టాలి. తరువాత ట్రే, షీట్‌ను అలాగే పట్టుకుని బాక్స్‌లో ఉంచాలి. దీంతో ట్రేలో క్రిస్టల్‌ క్లియర్‌ ఐస్‌ తయారవుతుంది.

అయితే ఇదంతా ఎందుకని అనుకుంటే ఆన్‌లైన్ లో ప్రత్యేకమైన ఐస్‌ ట్రేలు లభిస్తాయి. వాటిని కొనుగోలు చేయవచ్చు. వాటిలో నీరు పోస్తే ఐస్‌ క్రిస్టల్‌ క్లియర్ గా తయారవుతుంది. ఐస్‌లు క్యూబ్‌ల మాదిరిగానే కాక గుండ్రంగా వచ్చేలా కూడా తయారు చేయవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment