కేవ‌లం రూ.8కే ఎల్‌పీజీ సిలిండ‌ర్‌ను పొందండిలా..!

June 4, 2021 12:27 PM

ఆన్‌లైన్ పేమెంట్ యాప్ పేటీఎం వినియోగ‌దారుల‌కు మ‌రోసారి బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. కేవ‌లం రూ.8కే ఎల్‌పీజీ సిలిండ‌ర్‌ను పొంద‌వ‌చ్చు. రూ.808 ఉన్న వంట గ్యాస్ సిలిండ‌ర్‌ను రూ.8కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. అందుకు గాను పేటీఎంలో గ్యాస్ సిలిండ‌ర్‌ను బుక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫ‌ర్ జూన్ 30వ తేదీ రాత్రి 11.59 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంద‌ని పేటీఎం తెలిపింది.

get lpg cylinder for rs 8 only in this way

ఈ ఆఫ‌ర్‌ను ఉప‌యోగించుకోవాలంటే వినియోగ‌దారులు పేటీఎం యాప్‌లోకి వెళ్లి అందులో గ్యాస్ సిలిండ‌ర్ ను బుక్ చేసే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. త‌రువాత భార‌త్‌, హెచ్‌పీ, ఇండేన్ గ్యాస్‌ల‌లో గ్యాస్ కంపెనీని ఎంచుకోవాలి. అనంత‌రం రాష్ట్రంను ఎంపిక చేయాలి. త‌రువాత ఎల్‌పీజీ క‌న్‌జ్యూమ‌ర్ నంబ‌ర్ లేదా మొబైల్ నంబ‌ర్ లేదా 17 అంకెల ఎల్‌పీజీ ఐడీని ఎంట‌ర్ చేయాలి. అనంత‌రం గ్యాస్ ఏజెన్సీని ఎంపిక చేసుకోవాలి. త‌రువాత సిలిండ‌ర్‌కు అయ్యే పూర్తి ధ‌ర‌ను చెల్లించాలి. దీంతో స్క్రాచ్ కార్డు వ‌స్తుంది.

ఆ కార్డుతో రూ.10 నుంచి రూ.800 వ‌ర‌కు క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది. రూ.800 వ‌స్తే అప్పుడు సిలిండ‌ర్ ను రూ.8కే పొందిన‌ట్లు అవుతుంది. అలా వ‌చ్చిన స్క్రాచ్ కార్డును 7 రోజుల్లోగా ఉప‌యోగించుకోవాలి. ఇక పేటీఎంలో మొద‌టి సారిగా గ్యాస్ సిలిండ‌ర్‌ను బుక్ చేసే వారికి మాత్ర‌మే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment