స‌మాచారం

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఇంధనాలకు డిమాండ్ ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో అనేక కొత్త పెట్రోల్ బంకులు నెలకొల్పబడుతున్నాయి. అంతే కాదు ఈ పెట్రోల్ బంకుల్లో చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి.తక్కువ పెట్రోల్ కొట్టి ఎక్కువ డబ్బులు తీసుకోవడం, కల్తీ పెట్రోల్ విక్రయించడం వంటి వాటితో వినియోగదారుల నుంచి డబ్బులు దొచేస్తున్నారు! కస్టమర్లను మోసం చేయడానికి పెట్రోల్ బంక్ సిబ్బంది ఇలాంటి అనేక కిటుకులను ప్రదర్శిస్తున్నారు. ఈ విధంగా పెట్రోల్ బంకుల్లో మోసపోకుండా ఉండటానికి ఈ కొన్ని నియమాలను పాటిస్తే తప్పకుండా మోసపోయే అవకాశం ఉండదు.

పెట్రోల్​ బంక్ వాళ్లు చేసే మోసాల్లో షార్ట్ ఫ్యూయలింగ్ ప్రధానమైనది​. దీనిని సింపుల్​గా చెప్పాలంటే, తక్కువ ఇంధనం నింపి, ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు. వాహనదారులు కారులోంచి కిందకు దిగరు. అదే మీరు చేస్తున్న పెద్ద తప్పు అని మర్చిపోకండి. చాలా పెట్రోల్‌ బంకుల్లో వాహనదారులు కిందకు దిగకపోవడం వల్లే ట్యాంక్‌ ఫుల్ చేస్తామనే పేరుతో వెహికల్ ఓనర్‌ని ఫూల్స్‌ని చేస్తున్నారు. పెట్రోల్​ బంకు వాళ్లు ఫ్యూయెల్ డెన్సిటీ (ఇంధన సాంద్రత)లో కూడా మార్పులు చేస్తుంటారు. ఈ మోసాన్ని నివారించాలంటే, మీటర్​లో ఇంధన సాంద్రతను చెక్ చేయాలి. కొన్నిసార్లు మీటర్​ను కూడా వాళ్లు మానిప్యులేట్ చేస్తుంటారు. పెట్రోల్ ఫ్లో చాలా వేగంగా ఉంటే, దాని డెన్సిటీలో మార్పులు చేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారని గుర్తించాలి.

కారు లేదా బైక్‌లో పెట్రోల్ లేదా డీజిల్ నింపుకునేటప్పుడు ముఖ్యంగా వాహనదారుడు వాహనం దిగి ఆయిల్‌ నింపే దగ్గర మీటర్ రీడింగ్‌ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఏమైనా మోసం చేశారని తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. సాధారణంగా పెట్రోల్​ బంకుల్లో ఎలాంటి స్కామ్​లు జరుగుతుంటాయో తెలుకోవాలి. వాటి నుంచి ఎలా బయట పడాలో కూడా అవగాహన పెంపొందించుకోవాలి. ఇలా చేయడం వల్ల బంకుల్లో చేసే స్కామ్​లను సులభంగా నివారించవచ్చు. ప్రతి ఆయిల్ కంపెనీ, ప్రతి పెట్రోల్ బంక్​లోనూ ఒక కంప్లైంట్​ రిజిస్టర్ బుక్​ను అందుబాటులో ఉంచుతుంది. ఒకవేళ అలా కుదరకపోతే, ఆయిల్ కంపెనీ వెబ్​సైట్​లోనూ సదరు పెట్రోల్ బంక్​పై ఫిర్యాదు చేయవచ్చు.మంచి పేరున్న ఇంధన స్టేషన్లో ఆయిల్ నింపుకోవడం ఉత్తమం. ఎప్పుడూ అలా చేయడం సురక్షితమైన ఆలోచన కూడా. వాహనదారులను మరియు ఇన్స్పెక్టర్లను మోసం చేయడానికి కొన్నిసార్లు మీటర్లు కూడా వక్రీకరించబడతాయి. కావున ఇటువంటి వాటిలో ఎక్కువ మోసం జరిగే అవకాశం ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM