బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. వచ్చే సెప్టెంబర్ నెలలో బ్యాంకు సెలవులకు సంబంధించిన వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకొని రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ నెలలో ఏకంగా 12 సెలవుదినాలను ప్రకటించింది. అయితే ఎప్పుడు ఏ బ్యాంకుకు సెలవులు ఉన్నాయి.. అనే విషయానికి వస్తే..
సెప్టెంబర్ నెలలో వీకెండ్ మాత్రమే కాకుండా పండుగలు పెద్ద ఎత్తున రావడం చేత అధిక మొత్తంలో బ్యాంకు సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ నెలలో 4 ఆదివారాలు, రెండవ శనివారం 4వ శనివారం కలిపి మొత్తం ఐదు రోజులు సెలవు దినాలను ప్రకటించింది. ఇకపోతే సెప్టెంబర్ 10వ తేదీ వినాయక చవితి కావడంచేత బ్యాంకులకు పలు రాష్ట్రాలలో సెలవుదినంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
సెప్టెంబర్ 5వ తేదీ ఆదివారం, 8వ తేదీ శ్రీమంత శంకర తిథి కావడంచేత గౌహతి రాష్ట్రంలో బ్యాంకు సెలవు దినంగా ప్రకటించింది. సెప్టెంబర్ 9 తీజ్ కావడంతో గ్యాంగ్ టక్ లో బ్యాంకు సెలవు దినం. సెప్టెంబర్ 10 వినాయక చవితి, 11 రెండవ శనివారం, 12 ఆదివారం. సెప్టెంబర్ 17న కర్మ పూజ కావడంతో రాంచీలో బ్యాంకు సెలవు దినం. సెప్టెంబర్ 19న ఆదివారం, 20వ తేదీన ఇంద్రజాత్రా, 21న శ్రీ నారాయణ గురు సమాధి రోజు కావడంతో కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకు సెలవు. సెప్టెంబర్ 25 నాలుగవ శనివారం, 26 ఆదివారం. సెప్టెంబర్ నెలలో పండుగలు రావడం వల్ల మొత్తం 12 సెలవు దినాలను రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…