ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్, ఆన్‌లైన్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఇలా చెక్ చేసుకోండి..!

July 13, 2021 4:56 PM

మీరు ఉద్యోగ‌స్తులా ? నెల నెలా పీఎఫ్ జ‌మ అవుతుందా ? అయితే మీ ఇంట్లో కూర్చునే మీ పీఎఫ్ ఖాతాలో ఎంత సొమ్ము ఉందో సుల‌భంగా ఇలా తెలుసుకోవచ్చు. ఉద్యోగ‌స్తులు ఎస్ఎంఎస్‌, మిస్డ్ కాల్, ఆన్‌లైన్‌, మొబైల్ ద్వారా త‌మ ఈపీఎఫ్‌వో ఖాతాలో ఎంత డ‌బ్బు బ్యాలెన్స్ ఉందో ఇలా సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

check your epfo balance in this way

ఈపీఎఫ్ స‌భ్యులు 7738299899 లేదా 011-22901406 అనే నంబ‌ర్‌ల‌కు మిస్డ్ కాల్ ఇవ్వ‌డం ద్వారా త‌మ పీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోవ‌చ్చు. అలాగే EPFOHO UAN LAN అని టైప్ చేసి 7738299899 అనే నంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ పంపించ‌డం ద్వారా కూడా ఆ మొత్తాన్ని తెలుసుకోవ‌చ్చు.

ఆన్‌లైన్ ద్వారా https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login అనే సైట్‌ను ఓపెన్ చేసి అందులో UAN తో లాగిన్ అయి ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోవ‌చ్చు. UMANG యాప్‌లో ఎంప్లాయీ సెంట్రిక్ స‌ర్వీసెస్ అనే ఆప్ష‌న్‌లో న్యూ పాస్ బుక్‌ను ఎంచుకుని UAN ద్వారా పీఎఫ్ ఖాతాలో ఎంత ఉందో చూసుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now