కొత్తగా బైక్ కొనాలనుకుంటున్నారా..? అది కూడాబజాజ్ కంపెనీకి చెందిన బైక్ కొనాలి అని భావించే వినియోగదారులకు బజాజ్ మోటార్ కంపెనీ ఒక చేదు వార్త చెబుతోంది. టు వీలర్ దిగ్గజ కంపెనీలలో ఒక్కటైన బజాజ్ మోటార్స్ కీలక నిర్ణయం తీసుకొని వినియోగదారులకు చేదు వార్తను తెలియజేస్తుంది. తాజాగా బజాజ్ కంపెనీ పాపులర్ ద్విచక్ర వాహనాల ధరలను పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలోనే పల్సర్ ఎన్ఎస్ 125 బైక్ ధరను పెంచేసింది. ఈ బైక్ ధర రూ.6,100 పెరిగింది. ఈ ధరలు పెంచడంతో ప్రస్తుతం రూ.93,630 ఉన్న పల్సర్ ఎన్ఎస్ 125 బైక్ రూ.99,730కు చేరింది. అయితే ఈ విధంగా బజాజ్ రేట్లను పెంచడానికి అసలు కారణం తెలియలేదు.
బజాజ్ కంపెనీ కేవలం పల్సర్ ఎన్ఎస్ 125 బైక్ ధరను మాత్రమే కాకుండా,పల్సర్ 125 బైక్ ధరను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ బైక్ ధర రూ.4,500 వరకు పెరిగింది.వేరియంట్ ప్రాతిపదికన బైక్ ధర పెంపు ఆధారపడి ఉంటుంది. దీంతో బజాజ్ బండి కొనాలనుకునే వారికి ఇది నిజంగానే ఒక చేదు వార్తగా మిగిలి ఉందని చెప్పవచ్చు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…