గరుడ పురాణం గురించి అందరికీ తెలుసు. ఇది అష్టాదశ పురాణాల్లో ఒకటి. వ్యాస మహర్షి దీన్ని రాశారు. శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుడునికి దీని గురించి చెప్పారు. అందుకే దీనికి గరుడ పురాణం అని పేరు వచ్చింది. ఇందులో మనుషులు చేసిన పాపాలకు వారు నరకంలో విధించే శిక్షల వివరాలు ఉంటాయి. మనం అపరిచితుడు సినిమాలో చూసినట్టుగానే శిక్షలు ఉంటాయి. అయితే అవే కాదు, ఇంకా ఇందులో తెలుసుకోవాల్సిన శిక్షల వివరాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే అసలు ఎవరు ఎలాంటి పాపం చేస్తే వారికి ఎలాంటి శిక్షలు పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తమ సంతోషం కోసం జంతువులను హింసిస్తూ వేడుక చూసే వారికి, అలా వాటిని చంపే వారికి నరకంలో శిక్ష పడుతుంది. వారిని సల సల కాగే నూనెలో ఫ్రై అయ్యేలా వేయిస్తారట.
2. ఎప్పుడూ ఇతరులను మోసం చేసే వారిని, అబద్దాలు ఆడే వారిని, తిట్టే వారిని నరకంలో శిక్షిస్తారు. వారిని అక్కడ తలకిందులుగా వేలాడదీసి క్రూరమైన జంతువులచే హింసింపజేస్తారు.
3. అధికార దుర్వినియోగానికి పాల్పడే వారికి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేసే వారికి నరకంలో శిక్ష ఉంటుంది. వారిని మానవుని వ్యర్థాలతో కూడిన నదిలో పారేస్తారు. అందులో మానవులకు చెందిన మలం, మూత్రం, ఇతర వ్యర్థాలు ఉంటాయి. వాటిని తాగుతూ వారు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
4. ఇతరులకు సహాయం చేయని వారికి నరకంలో శిక్ష ఉంటుంది. వారి ఎత్తయిన లోయలోంచి కిందకు విసిరేస్తారు. అక్కడ ప్రమాదకరమైన పాములు, తేళ్లు వంటి విష పురుగులతో కుట్టిస్తారు. ఆ తరువాత క్రూర జంతువులతో హింసిస్తారు.
5. పెద్దలకు గౌరవం ఇవ్వని వారికి, వారిని నిర్లక్ష్యం చేసే వారికి కూడా నరకంలో శిక్ష ఉంటుంది. వారిని బాగా వేడిగా ఉండే ప్రదేశంలో ఉంచుతారు. ఆ బాధకు తట్టుకోకున్నా సరే అందులో ఉండాల్సిందే.
6. ప్రజలను సరిగ్గా పాలించకుండా, వారి సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి నరకంలో దారుణమైన శిక్ష వేస్తారు. వారి శరీరాలను పిప్పి పిప్పి చేస్తారు. అంతకు ముందు దారుణంగా కొడతారు. ఆ తరువాత శరీరాలను రోడ్డు రోలర్ కింద వేసి నలిపినట్టు నలిపేస్తారు.
7. ప్రజల ధనం, వస్తువులను దోపిడీ చేసే వారికి నరకంలో ఎలాంటి శిక్ష పడుతుందంటే వారిని యమభటులు తాళ్లతో దారుణంగా కట్టేసి రక్తం వచ్చే వరకు కొడతారు. రక్తాలు కారుతున్నప్పటికీ కొట్టడం ఆపరు. వారు పడిపోయే వరకు అలా కొడుతూనే ఉంటారు.
8. జంతులను చంపే వారికి కూడా నరకంలో శిక్షలు పడతాయి. వారిని జంతులను నరికినట్టే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతారట.
9. ఆడ, మగ ఎవరైనా ఒకరు ఇంకొకరిని లైంగికంగా వేధించినా, అత్యాచారం చేసినా నరకంలో వారి జననావయవాలను కత్తిరిస్తారు.
10. మద్యం సేవించే వారికి నరకంలో శిక్ష ఉంటుంది. వారి చేత ద్రవ రూపంలో ఉన్న వేడి ఇనుమును తాగిస్తారట.
11. పేదలకు అన్నం పెట్టకుండా తామే తినే వారికి కూడా నరకంలో శిక్ష ఉంటుంది. వారి శరీరాన్ని పక్షులకు ఆహారంగా వేస్తారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…