Atal Pension Yojana Scheme : కేంద్రం కొత్త ప‌థ‌కం.. భార్యాభ‌ర్త‌ల‌కు నెల‌కు రూ.10వేలు.. ఎలాగంటే..?

October 7, 2023 7:30 PM

Atal Pension Yojana Scheme : జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండకుండా ఉండాలంటే, ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఉద్యోగం చేసినన్ని రోజులు బానే ఉంటుంది. ఆ తర్వాత, ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ఆర్థిక ఇబ్బందులు రాకుండా సరిగ్గా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజుల్లో ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో ఇన్వెస్ట్ చేస్తే, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాదు. కేంద్ర ప్రభుత్వం కూడా, ఎన్నో స్కీములని తీసుకు వస్తూ వుంది. ఈ స్కీములతో చాలామంది ప్రయోజనం పొందుతున్నారు.

60 ఏళ్లు దాటిన తర్వాత, పనిచేసి డబ్బులు సంపాదించలేని పరిస్థితిలో, పెన్షన్ చాలా ముఖ్యం. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఆటోమేటిక్ గా పెన్షన్ వస్తుంది. కానీ, సొంతవ్యాపారాలు, సొంత పని చేసుకునే అసంఘటిత రంగంలోని కార్మికులకి, పెన్షన్ వంటివి ఉండవు. అందుకే, కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకువచ్చింది. ఆ పథకం గురించి పూర్తి వివరాలను చూద్దాం.

Atal Pension Yojana Scheme details in telugu
Atal Pension Yojana Scheme

పేద, మధ్య తరగతి వాళ్ళ కోసం, పలు రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ లో డబ్బులు పెడితే, వృద్ధాప్యంలో ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కేంద్ర ప్రభుత్వమే నెలకు 10 వేల రూపాయలను ఇస్తుంది. 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత, నెల నెలా పెన్షన్ వస్తుంది. 18 ఏళ్ళు పైబడి 40 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు దీనిలో చేరచ్చు. వయసును బట్టి ప్రీమియం మారుతూ ఉంటుంది.

భార్యాభర్తలు ఇద్దరు కూడా పథకంలో చేరొచ్చు. 5 వేల చొప్పున పెన్షన్ వచ్చేలా ప్రీమియం కడితే, 10 వేలు పెన్షన్ వస్తుంది. జాతీయ బ్యాంకులు కి వెళ్లి, ఈ స్కీమ్ లో చేరచ్చు. ఇక ఎంత వస్తుంది అనే విషయానికి వస్తే, 18 ఏళ్ల వయసులో చేరితే 42 రూపాయలను మీరు చెల్లిస్తే చాలు. ఒకవేళ 40 ఏళ్ల వయసులో చేరితే, నెలకు 210 కట్టాల్సి ఉంటుంది. ఇలా నెలకు 10 వేల రూపాయలను పెన్షన్ గా పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment