రూ.100 తో రూ.10 లక్షలు పొందే అద్భుతమైన పోస్ట్ ఆఫీస్ స్కీమ్!

June 29, 2021 12:42 PM

మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా… ఈవిధంగా డబ్బులను పొదుపు చేయాలి అనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ అద్భుతమైన స్కీమ్ మీ ముందుకు తీసుకు వస్తోంది. తక్కువ మొత్తంలో అదిరిపోయే రాబడిని పొందాలనుకునే వారికి ఇది ఎంతో ప్రయోజనకరమైనది. మరెందుకు ఆలస్యం ఈ స్కీమ్ వివరాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ ఇప్పటివరకు అందిస్తున్న ఎన్నో పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF స్కీమ్ కూడా ఒకటి. ఇందులో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడిని పొందవచ్చు. మీరు ఈ పథకంలో చేరి ప్రతిరోజు కేవలం రూ.100 లను పొదుపు చేస్తే చాలు ఏకంగా 10 లక్షలను పొందవచ్చు. ఈ పథకం కింద సంవత్సరానికి 500 నుంచి 1.5 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ పథకం పై కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ స్కీమ్ కాలపరిమితి 15 సంవత్సరాలు.ప్రతి నెల 3000 చొప్పున ఈ స్కీమ్ కింద పొదుపు చేస్తే 15 సంవత్సరాల తర్వాత ఏకంగా 10 లక్షల రూపాయలను పొందవచ్చు.ఈ విధమైనటువంటి పోస్ట్ ఆఫీస్ పథకాలలో డబ్బులు పొదుపు చేయడం వల్ల మన డబ్బుకు భద్రత ఉండడమే కాకుండా, అధిక రాబడిని కూడా పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now