ఆధార్‌-పాన్ లింకింగ్‌కు చివ‌రి గడువు జూన్ 30.. రెండూ లింక్ అయ్యాయో లేదో ఇలా చెక్ చేసుకోండి..!

June 19, 2021 2:19 PM

ఆధార్‌ను పాన్ తో అనుసంధానించేందుకు కేంద్రం ఇప్ప‌టికే ప‌లు మార్లు గ‌డువును పొడిగిస్తూ వ‌చ్చిన విష‌యం విదిత‌మే. క‌రోనా వ‌ల్ల ఆ గడువును కేంద్రం ఎప్ప‌టిక‌ప్పుడు పొడిగించింది. ఈ క్ర‌మంలోనే మార్చి 31వ తేదీ వ‌ర‌కు ఉన్న గ‌డువును జూన్ 30 వ‌ర‌కు పెంచారు. ఇక ఈ గ‌డువు కూడా ముగింపుకు వ‌చ్చేస్తోంది. కానీ దీన్ని ఇంకా పెంచ‌డంపై కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆ తేదీలోగా పౌరులు త‌మ ఆధార్‌ను పాన్ తో అనుసంధానించాల్సి ఉంటుంది. లేదంటే రూ.1000 జరిమానా వ‌సూలు చేస్తారు. అలాగే పాన్ కార్డు ప‌నిచేయ‌కుండా పోతుంది.

aadhar and pan linking last date june 30 check they are linked or not in these ways

కేంద్ర ప్ర‌భుత్వం 1961 ఇన్ క‌మ్ ట్యాక్స్ యాక్ట్ సెక్ష‌న్ 234 హెచ్ ప్ర‌కారం ఆధార్‌ను పాన్‌తో అనుసంధానించ‌డంపై నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఇదివ‌ర‌కే విడుద‌ల చేసింది. వాటి ప్ర‌కారం పౌరులు త‌ప్ప‌నిసరిగా త‌మ ఆధార్‌ను పాన్‌తో అనుసంధానించాలి. లేదంటే గ‌డువు తీరిన త‌రువాత పాన్ ప‌నిచేయ‌దు. పైగా జ‌రిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. క‌నుక ఇచ్చిన తేదీలోగా పౌరులు త‌ప్ప‌కుండా త‌మ ఆధార్‌ను పాన్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది.

ఇక ఆధార్‌ను పాన్‌తో అనుసంధానించాలంటే అందుకు ప‌లు మార్గాలు ఉన్నాయి. 567678 అనే నంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ పంప‌డం ద్వారా ఆధార్‌ను పాన్‌తో అనుసంధానించ‌వ‌చ్చు. అలాగే ఇన్‌క‌మ్‌ట్యాక్స్ ఇ-ఫైలింగ్ సైట్‌లోనూ రెండింటినీ లింక్ చేయ‌వ‌చ్చు. లేదా పాన్ స‌ర్వీస్ సెంట‌ర్‌లోనూ ఆధార్‌ను పాన్ తో అనుసంధానం చేయ‌వ‌చ్చు.

పాన్ – ఆధార్ లింక్ అయి ఉన్నాయా ఇలా చెక్ చేయండి

స్టెప్ 1 – ఏదైనా ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌ను ఓపెన్ చేసి అందులో ఇన్ క‌మ్ ట్యాక్స్ విభాగం అధికారిక వెబ్‌సైట్ www.incometax.gov.in ను ఓపెన్ చేయాలి.

స్టెప్ 2 – వెబ్‌సైట్ హోమ్ పేజీలో లింక్ ఆధార్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. అది క్విక్ లింక్స్ అనే సెక్ష‌న్‌లో ఉంటుంది.

స్టెప్ 3 – లింక్ ఆధార్ అనే ఆప్ష‌న్‌లో ఉండే నో అబౌట్ యువ‌ర్ ఆధార్ పాన్ లింకింగ్ స్టేట‌స్ అనే ఆప్ష‌న్ పై క్లిక్ చేయాలి.

స్టెప్ 4 – కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో పాన్‌, ఆధార్ కార్డు వివ‌రాల‌ను మెన్ష‌న్ చేసిన బాక్స్‌లో ఎంట‌ర్ చేయాలి.

స్టెప్ 5 – వివ‌రాల‌ను నింపిన త‌రువాత వ్యూ లింక్ ఆధార్ స్టేట‌స్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 6 – మీ ఆధార్‌-పాన్ లింక్ స్టేట‌స్‌ను వెబ్‌సైట్ చూపిస్తుంది.

ఇలా ఆధార్‌, పాన్ లింక్ అయి ఉన్నాయో, లేదో సుల‌భంగా చెక్ చేసుకోవ‌చ్చు.

ఇక ఎస్ఎంఎస్‌ను పంపించ‌డం ద్వారా కూడా రెండింటి లింక్ స్టేట‌స్‌ను చెక్ చేయ‌వ‌చ్చు.

స్టెప్ 1 – మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ నుంచి 12 అంకెల ఆధార్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేసి స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ నంబ‌ర్‌ను టైప్ చేయాలి.

స్టెప్ 2 – అనంత‌రం మెసేజ్‌ను 567678 లేదా 56161 నంబ‌ర్‌కు సెండ్ చేయాలి.

స్టెప్ 3 – ఆధార్‌, పాన్ రెండూ లింక్ అయ్యాయో, లేదో మీకు ఎస్ఎంఎస్ రూపంలో రిప్లై వ‌స్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now