వాట్సాప్ యూజ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. ఈ ఫోన్ల‌లో వాట్సాప్ త్వ‌ర‌లో ప‌నిచేయ‌దు.. లిస్ట్‌లో మీరు వాడే ఫోన్ ఉందో, లేదో చెక్ చేయండి..!

September 4, 2021 9:58 PM

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త్వ‌ర‌లో ప‌లు ఫోన్ల‌లో వాట్సాప్ ప‌నిచేయ‌ద‌ని చెప్పింది. ఎప్ప‌టిక‌ప్పుడు యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేలా కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందిస్తున్న వాట్సాప్ త్వ‌ర‌లో కొన్ని ఫోన్ల‌లో ప‌నిచేయ‌దు. ఈ మేర‌కు వాట్సాప్ ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించింది.

వాట్సాప్ యూజ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. ఈ ఫోన్ల‌లో వాట్సాప్ త్వ‌ర‌లో ప‌నిచేయ‌దు.. లిస్ట్‌లో మీరు వాడే ఫోన్ ఉందో, లేదో చెక్ చేయండి..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక మంది యూజ‌ర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ల‌లో వాట్సాప్ మొద‌టి స్థానంలో ఉంది. అయితే త్వ‌ర‌లో కొన్ని ర‌కాల ఫోన్ల‌లో వాట్సాప్ ప‌నిచేయ‌దు.

ఆండ్రాయిడ్ 4.0.4 అంత‌క‌న్నా త‌క్కువ వెర్ష‌న్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ల‌తోపాటు ఐఓఎస్ 9.0 అంత‌క‌న్నా త‌క్కువ వెర్ష‌న్ ఉన్న యాపిల్ డివైస్‌ల‌లో వాట్సాప్ ప‌నిచేయ‌దు. మ‌రో రెండు నెలల్లో ఈ ఫోన్ల‌లో వాట్సాప్ ప‌నిచేయ‌ద‌ని ఆ సంస్థ తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలో కింద తెలిపిన డివైస్‌ల‌ను వాడుతున్న వారు త‌మ డివైస్‌ల‌ను మార్చుకోవాల్సి ఉంటుంది.

శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎస్‌3 మినీ, ట్రెండ్ 2, ట్రెండ్ లైట్‌, కోర్‌, ఏస్ 2, ఎల్‌జీ ఆప్టిమ‌స్ ఎఫ్‌7, ఎఫ్‌5, ఎల్‌3 2 డ్యుయ‌ల్‌, ఎఫ్‌7 2, ఎఫ్5 2, సోనీ ఎక్స్‌పీరియా, హువావే అసెండ్ మేట్‌, అసెండ్ డి2, యాపిల్ ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 6ఎస్‌, 6ఎస్ ప్ల‌స్ ఫోన్ల‌లో త్వ‌ర‌లో వాట్సాప్ ప‌నిచేయ‌దు. దీంతోపాటు మ‌రో 40 స్మార్ట్ ఫోన్ల‌లోనూ వాట్సాప్ ప‌నిచేయ‌దు. క‌నుక ఈ ఫోన్ల‌ను వాడుతున్న వారు నూత‌న ఫోన్ల‌కు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now