మీకు స‌మీపంలో కోవిడ్‌ వ్యాక్సిన్ సెంట‌ర్ ఎక్కడుందో గూగుల్‌లో చూపిస్తుంది..!!

April 17, 2021 11:44 AM

గతేడాది కోవిడ్ వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న యూజ‌ర్ల‌కు మ‌రింత సౌక‌ర్యాన్ని క‌ల్పించేందుకు టెక్ దిగ్గ‌జ సంస్థ‌లు యాపిల్‌, గూగుల్‌లు పలు టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు కోవిడ్‌పై మ‌రింత స‌మాచారం అందింది. అయితే తాజాగా గూగుల్ మ‌రో కొత్త టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని స‌హాయంతో దేశంలో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ సెంట‌ర్ల వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు.

now you can search for your nearest covid vaccine center in google

స్మార్ట్ ఫోన్ల వినియోగ‌దారులు త‌మ త‌మ ఫోన్ల‌లో గూగుల్ మ్యాప్స్ లేదా గూగుల్ సెర్చ్‌లో త‌మ‌కు స‌మీపంలోని కోవిడ్ టీకా కేంద్రాల గురించి వెద‌క‌వ‌చ్చు. దీంతో వెంట‌నే రిజ‌ల్ట్స్‌లో ఆ వివ‌రాలు క‌నిపిస్తాయి. ప్ర‌స్తుతం కేవ‌లం భార‌త్‌లోని యూజర్ల‌కు మాత్ర‌మే ఈ ఫీచ‌ర్ అందుబాటులో ఉంది. త్వ‌ర‌లో అమెరికా, కెన‌డా, ఫ్రాన్స్‌, చిలీ, సింగ‌పూర్ దేశాల యూజ‌ర్లకు కూడా ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది.

ఇక గూగుల్ ఇప్ప‌టికే పేద దేశాల ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేసేందుకు ఆర్థిక స‌హాయం చేస్తామ‌ని తెలిపింది. అందులో భాగంగానే గూగుల్ 250 మిలియ‌న్ డాల‌ర్ల‌ను స‌హాయంగా అందించ‌నుంది. ఇందులో భాగంగా 2.50 ల‌క్ష‌ల మందికి టీకాలు అంద‌నున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment