ఎంఐ యానివ‌ర్స‌రీ సేల్ 2021.. షియోమీ ఉత్ప‌త్తుల‌పై త‌గ్గింపు ధ‌ర‌లు.. ఆఫ‌ర్లు..!

July 12, 2021 5:45 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. 7వ ఎంఐ యానివ‌ర్స‌రీ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ సోమ‌వారం ప్రారంభం కాగా ఈ నెల 16వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా రోజూ ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌త్యేక‌మైన డీల్స్ ను అందిస్తారు. అలాగే సాయంత్రం 4 గంట‌ల‌కు కూడా డీల్స్ ఉంటాయి. కొన్ని ర‌కాల ఉత్ప‌త్తుల‌ను రూ.99, రూ.299, రూ.499, రూ.999 ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

mi anniversary sale offers discounts

సేల్‌లో భాగంగా ఎంఐ వాట‌ర్ ప్యూరిఫైర్, రెడ్‌మీ 9ఎ, ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్‌ఫోన్స్, ఎంఐ హోమ్ సెక్యూరిటీ కెమెరా 360, ఎంఐ పోర్ట‌బుల్ ఎల‌క్ట్రిక్ ఎయిర్ కంప్రెస‌ర్‌, ఎంఐ బియ‌ర్డ్ ట్రిమ్మ‌ర్‌, ఎంఐ ఔట్ డోర్ బ్లూటూత్ స్పీక‌ర్‌, రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్‌, రెడ్‌మీ ఇయ‌ర్ బ‌డ్స్ ను త‌క్కువ ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

అలాగే ఎంఐ ఆటోమేటిక్ సోప్ డిస్పెన్స‌ర్‌, ఎంఐ రూట‌ర్ 4సి, ఎంఐ స్మార్ట్ ఎల్‌డీ బల్బ్‌, ఎంఐ ఎల‌క్ట్రిక్ టూత్ బ్ర‌ష్‌, ప్రొటెక్టివ్ మాస్క్, సోనిక్ చార్జ్ అడాప్ట‌ర్‌, ఇయ‌ర్ ఫోన్స్‌, ఇత‌ర ఫోన్ల‌పై కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల‌తో అయితే రూ.1000 వ‌రకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now