ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు మార‌డం క‌ష్ట‌మా ?

July 2, 2021 7:39 PM

మార్కెట్‌లో ప్ర‌స్తుతం మ‌న‌కు రెండు ర‌కాల ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక‌టి ఆండ్రాయిడ్ ఓఎస్ క‌లిగిన ఫోన్లు. రెండు ఐఓఎస్ క‌లిగిన ఐఫోన్లు. ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను అనేక ర‌కాల కంపెనీలు త‌యారు చేస్తున్నాయి. కానీ ఐఫోన్ల‌ను కేవ‌లం యాపిల్ సంస్థే త‌యారు చేస్తుంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను వాడేవారు ఉన్న‌ట్లుండి ఐఫోన్ కు మారితే క‌ష్ట‌మే. కొద్దిగా అల‌వాటు ప‌డాలి. ఇక డేటా విష‌యానికి వ‌స్తే దాన్ని ట్రాన్స్ ఫ‌ర్ చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.

is it hard to change phone from android to ios

గ‌తంలో ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి ఐఫోన్ల‌కు మారేందుకు క‌ష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అనేక యాప్స్ అందుబాటులోకి వ‌చ్చాయి. క‌నుక ఆండ్రాయిడ్‌లో వాడే అవే యాప్‌లు ఐఓఎస్‌లోనూ అందుబాటులో ఉంటాయి. క‌నుక పెద్ద‌గా ఇబ్బంది ప‌డాల్సిన ప‌నిలేదు. కానీ వాట్సాప్ వంటి యాప్‌ల డేటాను ట్రాన్స్ ఫ‌ర్ చేయ‌డం క‌ష్ట‌మ‌వుతుంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండే ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్‌, ఇత‌ర ఫైల్స్ ను పీసీకి క‌నెక్ట్ అయి అందులోకి ట్రాన్స్ ఫ‌ర్ చేయాలి. త‌రువాత ఐఫోన్‌ను క‌నెక్ట్ చేసి అందులోకి ఆ డేటాను ఐట్యూన్స్ ద్వారా పంపించుకోవ‌చ్చు. ఇక వాట్సాప్ డేటాను బ‌దిలీ చేయాలంటే doctor fone అనే సాఫ్ట్ వేర్ అందుబాటులో ఉంది. దాన్ని పీసీలో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీంతో ఆండ్రాయిడ్ లో ఉన్న వాట్సాప్ డేటా మాత్ర‌మే కాదు, ఇత‌ర డేటాను కూడా ఐఫోన్‌లోకి సుల‌భంగా పంపించుకోవ‌చ్చు. కాక‌పోతే ఆ సాఫ్ట్‌వేర్ ఉచితం కాదు. డ‌బ్బులు చెల్లించాలి. మీరు డేటా చాలా విలువైంది అని భావిస్తే ఆ సాఫ్ట్ వేర్‌ను కొనుగోలు చేసి అందులో ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు డేటాను బ‌దిలీ చేసుకోవ‌చ్చు. లేదా టెక్నిషియ‌న్ వ‌ద్ద‌కు తీసుకెళ్తే కొన్ని గంట‌ల్లో డేటాను బ‌దిలీ చేస్తారు. కానీ ఆ స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. మ‌న డేటాను వారు త‌స్క‌రించ‌కుండా చూసుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now