యూట్యూబ్‌లో యాడ్స్ లేకుండా వీడియోల‌ను ఎలా చూడాలో తెలుసా ?

August 1, 2021 3:58 PM

యూట్యూబ్‌లో మ‌నం చూసే వీడియోల‌కు సహ‌జంగానే యాడ్స్ వ‌స్తుంటాయి. కొన్ని వీడియోల‌కు ముందుగానే యాడ్స్ వ‌స్తాయి. కొన్ని మ‌ధ్య‌లో వ‌స్తాయి. దీంతో ఒక్కోసారి మ‌న‌కు విసుగు వ‌స్తుంది. అయితే కింద తెలిపిన ట్రిక్స్ పాటిస్తే యూట్యూబ్‌లో యాడ్స్ రాకుండానే వీడియోల‌ను చూడ‌వ‌చ్చు. మ‌రి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!

how to watch videos in youtube without ads

* యూట్యూబ్ వీడియోల‌ను బ్రౌజర్‌లో చూస్తున్నట్లయితే url లో youtube.com లేదా youtu.be తరువాత ఒక చుక్క ( . ) ను చేర్చి ఎంటర్ కీ ని ప్రెస్ చేస్తే మీరు చూస్తున్న వీడియోలో యాడ్స్ రావు.

అంటే ఉదాహ‌ర‌ణ‌కు.. https://www.youtube.com/watch?v=bCrz03-OJtY అనే వీడియోను తీసుకుంటే అందులో https://www.youtube.com త‌రువాత https://www.youtube.com. అని చుక్క‌ను చేర్చాలి. త‌రువాత ఆ url ఇలా క‌నిపిస్తుంది. https://www.youtube.com./watch?v=bCrz03-OJtY దీన్ని ఓపెన్ చేస్తే యాడ్స్ రాకుండా వీడియోలు చూడ‌వ‌చ్చు.

అలాగే https://youtu.be/bCrz03-OJtY అనే వీడియోలో youtu.be త‌రువాత youtu.be. అని చేర్చాలి. దీంతో ఆ url ఇలా మారుతుంది. https://youtu.be./bCrz03-OJtY. దీన్ని ఓపెన్ చేసినా యాడ్స్ రావు. ఇలా యూట్యూబ్
ఉదాహరణకు url లో మార్పు చేస్తే యాడ్స్ రాకుండానే వీడియోల‌ను చూడ‌వ‌చ్చు.

* వీడియోని చివరి వరకు స్క్రోల్ చేసి, పూర్తయిన తర్వాత రీప్లే బటన్ నొక్కి వీడియోను చూడాలి. దీంతో మళ్లీ వీడియో ప్లే అయ్యేటప్పుడు యాడ్స్ రావు.

* మీరు డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌ వాడుతూ ఉంటే మీరు వాడుతున్న క్రోమ్, ఫైర్ ఫాక్స్ లాంటి బ్రౌజర్స్ లో uBlock అనే ఎక్స్‌టెన్షన్ ను వాడితే యూట్యూబ్ తో సహా ఏ వెబ్‌సైట్ లోనూ యాడ్స్ రావు.

* మీరు మొబైల్ ఫోన్ వాడుతూ ఉంటే Brave లేదా వేరే ఏదైనా యాడ్ బ్లాక్ బ్రౌజర్ లో యూట్యూబ్ వాడితే అందులో యాడ్స్ రావు.

* Vanced, NewPipe లాంటి యాప్స్ ను ఇన్‌స్టాల్‌ చేసి వాడుకోవచ్చు. ఇవి అచ్చం యూట్యూబ్ మాదిరే ఉంటాయి. వీటిలో కూడా ఎటువంటి యాడ్స్ రావు. ఈ యాప్స్ స్మార్ట్ టీవీ లో కూడా పనిచేస్తాయి.

ఇదంతా త‌ల‌నొప్పి ఎందుక‌ని అనుకుంటే యూట్యూబ్‌లె నెల‌కు రూ.129 చెల్లిస్తే చాలు, ప్రీమియం అకౌంట్ వ‌స్తుంది. దీంతో ఏ వీడియోను అయినా స‌రే యాడ్స్ రాకుండా చూడ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now