శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎ22 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్ లో విడుదల చేసింది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది.
ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను అమర్చారు. అందువల్ల 5జికి సపోర్ట్ లభిస్తుంది. 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందిస్తున్నారు. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. రెండు సిమ్‌లను వేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను ఇందులో అందిస్తున్నారు. 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను వెనుక వైపు ఏర్పాటు చేశారు. దీనికి తోడు 5, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు అదనంగా ఉన్నాయి. 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. డాల్బీ అట్మోస్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఇతర ఫీచర్లను ఇందులో ఏర్పాటు చేశారు.
శాంసంగ్ గెలాక్సీ ఎ22 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.21,999గా ఉంది. ఈ ఫోన్‌ను అన్ని ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఈ ఫోన్‌పై రూ.1500 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…