మొబైల్స్ తయారీదారు ఐక్యూ కొత్తగా ఐక్యూ 7 లెజెండ్ 5జి (iQOO 7 Legend 5G) ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.62 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఈ ఫోన్‌లో ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. కూలింగ్ కోసం ప్రత్యేకంగా వేపర్ చాంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు మరో 13 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 13 మెగాపిక్సల్ పోర్ట్రెయిట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. దీనికి 66 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ కేవలం 22 నిమిషాల్లోనే 0 నుంచి 100 శాతం చార్జింగ్ అవుతుంది.
ఐక్యూ 7 లెజెండ్ 5జి ఫోన్ వైట్ కలర్ ఆప్షన్‌లో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.39,990 ఉండగా, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.43,990గా ఉంది. ఈ ఫోన్‌ను మే 1వ తేదీ నుంచి అమెజాన్‌తోపాటు ఐక్యూ ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయిస్తారు.
లాంచింగ్ సందర్బంగా ఈ ఫోన్‌పై ఆఫర్లను అందిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్‌పై రూ.3000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అమెజాన్ కూపన్లతో రూ.2000 డిస్కౌంట్ ఇస్తారు. 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందిస్తారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…