రూ.60వేల లోపు ల‌భిస్తున్న బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే..!

August 25, 2021 1:28 PM

ల్యాప్‌టాప్ ల‌ను కొనేవారు స‌హ‌జంగానే వాటిలో ఉండే ఫీచ‌ర్ల‌తోపాటు వాటి ధ‌ర‌ల‌ను కూడా చూస్తారు. త‌క్కువ ధ‌ర‌ను క‌లిగి ఉండడ‌మే కాక ఉత్త‌మ ఫీచ‌ర్లు ఉండేలా ల్యాప్‌టాప్‌ల‌ను తీసుకుంటారు. ఈ క్ర‌మంలోనే అలాంటి బెస్ట్ ల్యాప్‌టాప్‌ల వివ‌రాల‌ను కింద ఇవ్వ‌డం జ‌రుగుతోంది. వాటిలో నచ్చిన ల్యాప్‌టాప్ ల‌ను ఎంచుకోవ‌చ్చు. మ‌రి వాటి వివ‌రాల‌ను తెలుసుకుందామా..!

రూ.60వేల లోపు ల‌భిస్తున్న బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే..!

డెల్ ఇన్‌స్పిరాన్ 3501

ఇందులో 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 10వ జ‌న‌రేష‌న్ కోర్ ఐ3-1005జి1 ప్రాసెస‌ర్, 4జీబీ ర్యామ్‌, 1టీబీ హార్డ్ డిస్క్‌, విండోస్ 10 హోమ్ ఎడిష‌న్‌, ఎంఎస్ ఆఫీస్‌, ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్స్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. దీని ధ‌ర రూ.40,990గా ఉంది.

లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3

ఇందులో 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, ఇంటెల్ 10వ జ‌న‌రేష‌న్ కోర్ ఐ5 హెచ్ సిరీస్ ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్‌, 512 జీబీ ఎస్ఎస్‌డీ, 4జీబీ గ్రాఫిక్ కార్డ్ ఫీచ‌ర్లు ఉన్నాయి. ధ‌ర రూ.60,990.

హెచ్‌పీ 15 15క్యూ-డీఏ3001టీయూ

ఇందులో ఇంటెల్ 10వ జ‌న‌రేష‌న్ కోర్ ఐ3 ప్రాసెస‌ర్‌, 15.6 ఇంచ్ డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్ ఫీచ‌ర్లు ఉన్నాయి. ధ‌ర రూ.37,999గా ఉంది.

అసుస్ వివోబుక్ అల్ట్రా కె15

ఇందులో 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఇంటెల్ 11వ జ‌న‌రేష‌న్ కోర్ ఐ7 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌, విండోస్ 10 హోమ్ ఫీచ‌ర్లు ఉన్నాయి. ధ‌ర రూ.42,990.

హెచ్‌పీ పెవిలియ‌న్ గేమింగ్ ల్యాప్‌టాప్

ఇందులో 15.6 ఇంచుల డిస్‌ప్లే, 8జీబీ ర్యామ్, 1టీబీ హార్డ్ డిస్క్‌, 4జీబీ గ్రాఫిక్ కార్డ్‌, విండోస్ 10 హోమ్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. ధ‌ర రూ.59,999.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now